వారంరోజులే.. జగన్ లో భయం..

జగన్ ఆందోళనగా ఉన్నారా.? ఏప్రిల్ 28న సీబీఐ కోర్టు తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ ఆయన ను మనోవేధనకు గురిచేస్తోందా.? వారం రోజులే గడువు ఉండడంతో మనోవేదనతో జగన్ పార్టీ కార్యక్రమాలన్నింటిని అందుకే రద్దుచేశారా.? చిత్తూరు జిల్లాలో దాదాపు 15 మంది చనిపోయినా కనీసం అటువైపు వెళ్లనిది అందుకేనా.? ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానం వినిపిస్తోంది.

ప్రత్యేక హోదా ఆందోళన అయినా.. అప్పట్లో దివాకర్ ట్రావెల్స్ యాక్సిడెంట్ జరిగినా మొదట అక్కడ వాలిపోయే జగన్.. చిత్తూరు జిల్లాలో లారీ యాక్సిడెంట్ లో 15మంది చనిపోయిన స్పందించకపోవడం ఏంటనే దానిపై వైసీపీ వర్గాలు ఆరాతీశాయట.. దీనికి జగన్ పై సీబీఐ కోర్టు తీర్పు కారణమని నాయకులు భావిస్తున్నట్టు తెలిసింది.

జగన్ కు చెందిన సాక్షి చానల్ అప్పట్లో మాజీ ప్రధానకార్యదర్శి రమాకాంత్ రెడ్డితో ఇంటర్వ్యూ నిర్వహించింది. జగన్ జైలు పాలు కావడం ఈ కేసులతో సాధ్యం కాదని అందులో చూపించారు. దీని ఆధారంగా సీబీఐ కోర్టులో పిటీషన్ వేసింది. జగన్ ఉద్దేశపూర్వకంగా సాక్షులను, కేసును తన చానల్ లో చూపిస్తూ తప్పుదోవపట్టిస్తున్నాడని జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటీషన్ లో సీబీఐ కోరింది. జగన్ కూడా ఇటీవలే వాదనలు వినిపించారు. దీంతో కోర్టు ఈనెల 28న తీర్పును వాయిదావేసింది.

ఒక వేళ సీబీఐ కోర్టు 28న జగన్ బెయిల్ రద్దు చేస్తే మళ్లీ జగన్ జైలు పాలు కావడం ఖాయం. అందుకే జగన్ ఆందోళనగా ఉన్నట్టు తెలిసింది. దానికారణంగా గుంటూరులో నిర్వహించే రైతు మహాసభను మే 1, 2కు వాయిదా వేయించారు. ఇప్పుడు చిత్తూరులో 15 మంది చనిపోయినా కూడా వారిని పరామర్శించేందుకు జగన్ వెళ్లలేదు.

To Top

Send this to a friend