వర్మ సినిమా.. ట్రైలర్ రిలీజ్

ఈ రాంగోపాల్ వర్మ ఎప్పుడు మొదలు పెడతాడో ఎప్పుడు పూర్తి చేస్తాడో ఎవ్వరికీ తెలీదు.. ఆయన ఎప్పుడు ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేస్తూ ఖాళీగానే కనపడతారు. అంతలోనే ఆయన సినిమాలు రిలీజ్ అయిపోతూ ఉంటాయి..
బుధవారం రాంగోపాల్ వర్మ-అమితాబ్ బచ్చన్ కాంబినేషన్ లో మూవీ సర్కార్ 3 ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అమితాబ్ ఇందులో మరింత సీరిస్ పాత్రలో కనిపించారు. గాయపడిన సింహం మరింత ప్రమాదకరం అనే మాటలతోనే బిగ్ బి ఇంట్రడక్షన్ వస్తుంది.. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ కనిపిస్తున్నారు. మనోజ్ బాజ్ పాయ్, యామీ గౌతమ్, జాకీ ఫ్రాష్ లు పాల్గొన్నారు. కంక్లూజన్ లో ఈ చేతులతోనే చంపుతా అనే సుభాష్ నాగ్రే మాటలతో ముగుస్తుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7న రిలీజ్ చేయాలన్నది వర్మ ఆలోచన..
సర్కార్ త్రి ట్రైలర్ ను కింద వీడియో లింక్ లో చూడొచ్చు..
To Top

Send this to a friend