వర్మకు పునకం వచ్చింది..


పునకం వచ్చినట్టు వర్మ మళ్లీ ట్విట్టర్ ద్వారా చెలరేగిపోతున్నాడు. పిచ్చోడి చేతిలో రాయి ఎవరికి తగులుతుందో తెలియదన్నట్టు ఈసారి మళ్లీ తన పైత్యాన్ని ప్రదర్శించాడు. మెగా, సూపర్ స్టార్లను అవమానించాడు. బాహుబలిని అడ్డంపెట్టుకొని చిరంజీవి, మహేశ్ బాబులపై పరుష పదాలను వాడాడు.

నిన్నటికి నిన్న బాహుబలి ట్రైలర్ చూసి ఇది తెలుగు సినిమాకు అమ్మలా ఉందని.. కాదు అమ్మమ్మలా ఉందని ట్వీట్ చేశాడు. రాజమౌళి తెలుగు సినిమాను జాతీయస్థాయికి తీసుకెళ్లాడని మెచ్చుకున్నాడు. అనంతరం సాయంత్రానికి బాహుబలిలో నటించిన ప్రభాస్ ను ఉద్దేశించి ట్వీట్ చేశాడు.

టాలీవుడ్ పవర్ ఫుల్ స్టార్లు చాలా మంది బాలీవుడ్ లో హీరోగా ట్రైచేసి ఘోరంగా విఫలమయ్యారని.. ఇఫ్పుడు రీజినల్ తెలుగు స్టార్లుగా మిగిలిపోయారని తెలిపారు. కానీ ప్రభాస్ బాహుబలి రెండు సినిమా అంతర్జాతీయ స్టార్ గా ఎదిగిపోయాడని కొనియాడారు. అంతేకాదు టాలీవుడ్ మెగా, సూపర్ స్టార్లు ప్రభాస్ కాలి గోటినందుకోవడానికి కూడా రెండు జన్మలు ఎత్తాల్సి ఉంటుందని నోరు జారీ చిక్కుల్లో పడ్డాడు. దీనిపై మెగా, సూపర్ స్టార్ చిరు, మహేశ్ అభిమానులు ట్విట్టర్లో దుమ్మెత్తి పోస్తున్నారు. వర్మ కల్లుతాగిన కోతిలా మాట్లాడుతున్నాడని మండిపడుతున్నారు.

To Top

Send this to a friend