వరుసకు కూతురు.. 5 నెలలుగా అత్యాచారం


దారుణాలు వెలుగుచూస్తున్నాయి. సభ్య సమాజం తలదించుకునే సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వావివారసలు లేకుండా పోతున్నాయి. వరుసగకు కూతురు అయిన అమ్మాయిపైనే భార్య లేనప్పుడు 5 నెలలు గా అత్యాచారం చేస్తున్న ఓ కీచకుడి విషయం విస్తుగొలిపింది. మంచిర్యాల జిల్లాలో ఈ దారుణం జరిగింది.

మంచిర్యాల జిల్లాకేంద్రంలోని రాజీవనగర్ లో దారునమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. రాజీవ్ నగర్ కు చెందిన మహాత్మ ఆనంద్ ఇంట్లో ఉంటూ వరుసకు కుతురైన ఖమ్మం జిల్లా ఇల్లందు కు చెందిన అమ్మాయి (20) ఉంటూ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో వరుసకు బాబాయ్ అయి ఆనంద్ వాయి వరుసలు మరిచి తన భార్య ఇంట్లో లేని సమయం లో పలుసార్లు అమ్మాయి పై అత్యాచారానికి పాల్పడుతూ విషయం బయటికి పొక్కితే చంపేస్తానని బెదిరించాడు. కాగా గత కొన్ని రోజులుగా విద్యార్థినికి తీవ్రంగా కడుపునొప్పి రావడం తో ఆసుపత్రికి వెళ్లగా 5 నెలల గర్భిణి అని తేలింది, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టుకు రిమాండ్ చేరినట్లు తెలిపారు.

To Top

Send this to a friend