వయసు పెరిగేకొద్దీ మరింత గ్లామర్ గా తయారవుతున్నాడు

khaidi No 150_still1

60 ఏళ్లు దగ్గరపడితే ఎలా ఉంటుంది. చేతిలో కర్ర.. నెలలో రెండు సార్లు డాక్టర్ చెకప్.. జుట్టు సగానికి పైగా ఊడిపోయి కుయ్రో మొర్రో అంటూ క్రిష్ణ రామ అంటూ కాలం గడపడమే.. కానీ మన మెగాస్టార్ వయసు పెరిగేకొద్దీ మరింత గ్లామర్ గా తయారవుతున్నాడు.. హీరోగా స్వశక్తితో పైకెదిగి ఓ ఎత్తుకు ఎదిగిన మెగాస్టార్ మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లి దెబ్బతిన్నారు.. కానీ రీయెంట్రీలో ఖైదీ నెం150 సినిమాతో మన ముందుకు గ్రాండ్ గా వస్తున్నాడు.. చిరు 150 వ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి.. అందుకు తగ్గట్టే వివి వినాయక్, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ లు కష్టపడుతున్నారు. ఇటీవల విడుదల చేసిన పాటలు అబ్బురపరుస్తున్నాయి. చిరు స్టైలింగ్ 30 ఏళ్ల యువకుడిలా మార్చేశాయి..
కుర్రహీరోగా కనపడుతున్న చిరంజీవికి 50 ఏళ్లు నిండాయంటే ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు. అంతలా ట్రైలర్ లో కనిపించారు. ఇక చిరు పక్కన ఏదో పెద్ద బోల్డ్ హీరోయిన్ ను పెట్టలేదు.. సుందరాంగి కాజల్ చిరుపక్కన ఆడిపాడబోతోంది. కాజల్ ఇప్పటికే మెగా ఫ్యామిలీతో చాలా కనెక్ట్ అయ్యి ఉంది. రాంచరణ్, అల్లు అర్జున్ తో సినిమాలు చేసింది. ఇప్పుడు చిరుతో చేస్తుండడంతో మరింత క్రేజ్ వచ్చింది.. మెగా ఫ్యామిలీతో చేసిన హీరోయిన్ గా గుర్తింపు పొందుతోంది. ఎంతైనా కాజల్ ది అదృష్టమే.

To Top

Send this to a friend