వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణకు కొత్త సీఎం..!

సంక్రాంతి నాడు సీఎం కేసీఆర్ తన నివాసమైన ప్రగతి భవన్ లో పార్టీ ప్రభుత్వ పాలనపై సమీక్ష నిర్వహించారు.. ఈ సందర్భంగా మంత్రుల శాఖలు, పనితీరును రిపోర్ట్ ల ఆధారంగా విశ్లేషించారట.. ఇందులో కేటీఆర్ చూస్తున్న పరిశ్రమల శాఖ అందరికంటే ముందున్నట్టు సమాచారం.. టీఎస్ ఐపాస్ తో పాటు కొత్త ఇండస్ట్రీయల్ పాలసీలతో రాష్ట్రానికి దాదాపు 2500 పరిశ్రమలు వచ్చాయని.. తద్వారా పెద్ద ఎత్తున ఉపాధి లభించదన్నారు. అంతేకాదు.. కేటీఆర్ సారథ్యంలో హైదరాబాద్ జీహెచ్ఎంసీ లో గులాబీ జెండా ఎగిరిందని.. అందుకే కేటీఆర్ డిస్టింక్షన్ మార్కులు వేసి మొదటి స్థానం కట్టబెట్టారట కేసీఆర్.. ఇక రెండో స్థానంలో హరీష్ ఉన్నట్టు సమాచారం. హరీశ్ సారథ్యంలోని ప్రాజెక్టులు, మిషన్ కాకతీయలతో ఆయన కూడా పాస్ అయినట్టేనని చెప్పాడట.. శాఖలు బాగా పనిచేయని మంత్రులకు కేసీఆర్ హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం..

కాగా ఇదే సమావేశంలో వచ్చే ఎన్నికలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారట. అప్పటికీ ఆరోగ్యం సహకరించకపోతే తాను వైదొలిగి గాడ్ ఫాదర్ లా ఉండి కేటీఆర్ తో పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించేలా ప్లాన్ చేస్తున్నారట కేసీఆర్.. ఇదే విషయాన్ని తన అంతరంగికులతో చర్చించారట.. ఇప్పటికే మూడు శాఖలు చూస్తున్న కేటీఆర్ బాగా పరిణతి చెందారని.. అతడిని ఈ మోఖాలోనే సీఎంను వచ్చేసారి చేస్తే బాగుంటుందని కేసీఆర్ అనుకుంటున్నారట.. తాను విశ్రాంతి తీసుకోవడమో.. లేక జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడమో ఏదో ఒకటి చేసేలా కేసీఆర్ ప్లాన్లు రెడీ చేస్తున్నారన్న మాట.. ఇదే జరిగితే తెలంగాణ రాబోయే సీఎంగా కేటీఆర్ నిలవడం ఖాయంగా కనిపిస్తోంది..

To Top

Send this to a friend