వచ్చే ఎన్నికల్లో మన ప్రధాని ఎవరో తెలిసిపోతుంది..

narendra-modi-demonetisation

ప్రధాని మోడీకి ముందుంది ముసళ్ల పండుగ.. పెద్దనోట్ల రద్దు నిర్ణయం సరైందా.. కాదా అన్నది ప్రజలే తేల్చబోతున్నారు. మోడీ మూడేళ్ల పాలనకు ప్రజలు పాస్ మార్కులు వేస్తారా..? ఫెయిల్ చేస్తారా కొద్దిరోజుల్లో తేలబోతోంది. ఈ మార్చిలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నాలు ప్రారంభించింది..
కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని 5 రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.. దేశంలోనే అతిపెద్ద.. అతి ఎక్కువ జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతోపాటు ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ లలో ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఐదు నియోజకవర్గాల్లో మొత్తం దేశంలోని 512 లోక్ సభ నియోజకవర్గాలకు గాను 102 ఉన్నాయి.. అంటే 25శాతం ప్రజల తీర్పు మోడీకి ఉందా లేదా అన్నది ఈ ఎన్నికలతో తేలిపోనుంది.. పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఒప్పా..? తప్పా..? అన్నది తేలిపోనుంది.. ప్రధానంగా పెద్దరాష్ట్రమైన యూపీపైనే బీజేపీ ఫోకస్ చేసింది. ఈ రాష్ట్రాన్ని సాధిస్తేనే ఏ పార్టీకైనా ఢిల్లీలో అధికారం దక్కుతుంది. అందుకే మోడీ వ్యూహరచన చేస్తున్నారు. ప్రస్తుతం యూపీలో సమాజ్ వాదీ, ఉత్తరఖండ్, మణిపూర్ లో కాంగ్రెస్, గోవాలో బీజేపీ, పంజాబ్ లో బీజేపీ-అకాలీదళ్ అధికారంలో ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే మోడీ పాలనకు గీటురాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ పాస్ అయితే వచ్చే 2019 ఎన్నికల్లో మోడీకి భవిష్యత్ ఉంటుంది. లేదంటే మరోసారి కాషాయ దళానికి ఓటమి తప్పదు..

To Top

Send this to a friend