వచ్చేసారి నేనే చంద్రబాబూ

‘రామాయణం, మహాభారతం, బైబిల్, ఖురాన్’ చదవడం మొదలెడితే అధర్మం, అన్యాయం గెలిచినట్టు మొదట కనిపిస్తుంది.. కానీ చివరకు మాత్రం ధర్మం, న్యాయమే గెలుస్తుందని’ వైఎస్ జగన్ అన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత గంగుల ప్రభాకర్ రెడ్డి వైఎస్ జగన్ సమక్షంలో నిన్న వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ గంగులన్న తమ పార్టీలో చేరడం ఆనందాన్నిచ్చిందన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు కావస్తోందని.. ఇక మిగిలిన రెండేళ్లు ఎన్నికల వేడినే ఉంటుందన్నారు. వచ్చేసారి అధికారం వైసీపీదేనని జగన్ స్పష్టం చేశారు.
ఆళ్లగడ్డ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన భూమా అఖిల ప్రియ టీడీపీలో చేరిపోయారు. టీడీపీ తరఫున గతంలో ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసిన ప్రభాకర్ రెడ్డి వైసీపీలో చేరడంతో టిట్ ఫర్ టాట్ అయ్యింది. ఈ పరిణామాలు అధికార టీడీపీకి కొంత ఇబ్బంది కలిగించాయి.. ప్రస్తుతం రాజకీయాల్లో ఎవరైనా అధికారపార్టీలో ఉండాలని కోరుకుంటారు.. అటువైపే అడుగులు వేస్తారు. అందుకే వైసీపీ నుంచి గెలిచినా కూడా భూమా నాగిరెడ్డి, అఖిలప్రియలు చంద్రబాబు పంచన చేరారు. అధికారం, దర్పం, ఆర్థికంగా అధికార పార్టీలో ఉంటే కొంచెం బాగుంటుందని వారు పార్టీ మారారు. ఈ నేపథ్యంలో టీడీపీలో ఉన్న ప్రభాకర్ రెడ్డి అనూహ్యంగా వైసీపీలో చేరడం ఆశ్చర్యపరించింది. వచ్చే 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ప్రభాకర్ రెడ్డి అధికార టీడీపీ కాదని వైసీపీలో చేరారని.. ఇది వైసీపీకి లాభం చేకూర్చేలా ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

To Top

Send this to a friend