వందల కోట్ల జయ ఆస్తులు ఎవరికీ..?

ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో జయలలిత, శశికళ సహా నిందితులకు శిక్ష పడింది.. జయ బతికి లేకపోవడంతో ఆమెను కేసునుంచి తీసేసినా.. ఆమె సంపాదించిన ఆస్తులు ఎవరికీ చెందుతాయనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది.. జయ చనిపోయినా ఈ కేసులో ఆమె తప్పు చేసినట్టే లెక్కలోకి వస్తుంది. దాంతో ఆమె ఆస్తులను కోర్టు జప్తు చేస్తుందా లేదా వారి వారసులకు చెందుతాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే జయకు బోలేడు ఆస్తులున్నాయి.. తమిళనాడు, హైదరాబాద్ లో ఎస్టేట్లు, కిలోలకొద్దీ బంగారం, భవనాలు, వజ్రాలు, ఖరీదైన వస్తువులు ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కోర్టు ఆధీనంలోకి వెళతాయి. మొదట్లో సుప్రీంకోర్టు జయకు 100 కోట్ల ఫైన్ విధించింది. కానీ నిన్న వెలువరించిన తీర్పులో దాన్ని ప్రస్తావించలేదు. శశికళ, ఇతరులకు కేవలం 10కోట్ల ఫైన్ విధించింది. ప్రస్తుతం కోర్టు అటాచ్ మెంట్ లో ఉన్న జయ 250 ఆస్తులను అధికారులను పూర్తిగా స్వాధీనం చేసుకొని వాటిని సీజ్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని ఏమీ చేయాలనే దానిపై కోర్టు నిర్ణయిస్తుంది.

జయ ఆస్తులను కోర్టు స్వాధీనం చేసుకొని ఫైన్ వసూలు చేశాక మిగిలిన ఆస్తులను ఎవరికీ కేటాయిస్తారన్న సందేహం నెలకొంది. జయ స్నేహితురాలు శశికళకు జయ ఆస్తులు చెందుతాయా.? లేక జయ మేనకోడలు దీపా, సోదరుడు దీపక్ లకు ఈ ఆస్తులు దక్కుతాయా అన్నది తేలాల్సింది.

To Top

Send this to a friend