వంగవీటిలా.. ముద్రగడను చంపేస్తారనుకున్నాం — దాసరి

అధికారం కోసం కాపులను వాడుకొని ఓట్లేయించుకున్న చంద్రబాబు అనంతరం వారికి రిజర్వేషన్లు కల్పించడంలో చేసిన జాప్యాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం పోరుబాట పట్టిన సంగతి తెలిసిందే.. తునిలో ఆయన నిర్వహించిన బహిరంగ సభ హింసాత్మకంగా మారడం.. ఆ విషయంలో ఆయన అరెస్ట్ అయ్యి జైలు కెళ్లడం తెలిసిందే.. ముద్రగడకు మద్దతుగా కాపు సామాజికవర్గ రాజకీయ నాయకులు, సినీ కళాకారులు ఏకమయ్యారు. ఆయనకు మద్దతుగా నిలిచి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉద్యమించారు.

ముద్రగడ పద్మనాభం దీక్షలకు దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు, హీరో చిరంజీవిలు బహిరంగ మద్దతు తెలిపారు. కాపు సామాజికవర్గ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు. అప్పట్లో సాగిన కాపు ఉద్యమం దెబ్బకు ప్రభుత్వం దిగివచ్చి ముద్రగడతో రాజీకి వచ్చింది.. ఆ పరిణామాలపై ఇటీవలే దాసరి నారాయణ రావు ఓ మీడియాతో మాట్లాడారు..

మీడియా జర్నలిస్ట్ దాసరి నారాయణ రావును కులప్రాతిపదికన విభజించి అడగడంపై దాసరి సీరియస్ అయ్యాడు. ‘‘కాపు కులాభిమానం వేరు.. ముద్రగడ వేరు.. వంగవీటి రంగ లా ముద్రగడను చంపేస్తారనే ఆయనకు మద్దతుగా నిలిచాం.. ఆయన తరఫున పోరాడాం. అంతేతప్ప కాపుల ఉద్యమానికి తాము ప్రాతినిధ్యం వహించామా..? మాలాంటి కళాకారులకు కులాలు, మతాలు, ప్రాంతాలు అంటగడుతారా.. మీడియా విచక్షణతొ మెలగాలి.’’ అంటూ దాసరి సదరు జర్నలిస్టును కడిగిపారేశాడు.. దాసరి, చిరుపై కాపు ముద్ర వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలపై దాసరి మండిపడ్డారు. కులాల కుంపట్లు అంటగట్టి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని జర్నలిస్టును హెచ్చరించాడు. అసలు ఏపీలో కాపులను తొక్కేసి, వాడుకొని పైకొచ్చిన వారే ఎక్కువగా ఉన్నారని.. కులం పేరుతో నాశనమైందే కాపులని దాసరి తన అవేదనను వెళ్లగక్కారు..

దాసరి ఇంటర్వ్యూలో మాట్లాడిన సంచలన విషయాలు కింది వీడియో లింక్ లో చూడొచ్చు..

To Top

Send this to a friend