లోకేష్ పెరుగుదల ముందు ముఖేష్ అంబానీ కూడా వేస్టే..

ముఖేష్ అంబానీ ఎరక్కపోయి బిజినెస్ లోకి వెళ్లాడు కానీ.. రాజకీయాల్లోకి వస్తే ఇంకా ఎక్కువే సంపదించేవాడేమో.. ముఖేష్ భారత దేశంలోనే నంబర్ 1 వ్యాపారవేత్త.. అక్కడికి చేరడానికి ఆయన తండ్రి, ఆయన ఎన్నో బిజినెస్ లు చేశారు. ఎంతో కష్టపడ్డారు. రిలయన్స్ మార్ట్ లు, డిజిటల్, పెట్రోలియం, జియో ఇలా సవాలక్ష బిజినెస్ లలో వారి హస్తం ఉంది. అందుకే ఇన్నేళ్లకు వాళ్లు గొప్పవాళ్లయ్యారు. కానీ అదే రాజకీయాల్లో చేరితే అంతకంటే ఎక్కవు సంపాదించేవారు కావచ్చు..

మన ఏపీ సీఎం చంద్రబాబు కొడుకు లోకేష్ బాబు ఆస్తులు కేవలం 5 నెలల్లోనే 22 రెట్లు పెరగడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.. తండ్రి ఏపీకి సీఎంగా నిస్వార్థంగా సేవలందిస్తున్నానని ఓవైపు ఊదరగొడుతున్నారు. మరి కొడుకేమో ఇలా 5 నెలల్లోనే కోట్లు కూడబెట్టి తండ్రి నిస్వార్థ రాజకీయాలకు భంగం కలిగిస్తున్నారు. ఇందులో ఏదీ నిజమో చంద్రబాబు-లోకేష్ లకే తెలియాలి… 5 నెలల్లో వందల కోట్లు జమ చేయడం ఎలాసాధ్యమో వాళ్లే చెప్పాలి.

లోకేష్ గత అక్టోబర్ లో తన మొత్తం ఆస్తి 14.5 కోట్లుగా ప్రకటించారు. తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికవుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన అఫిడవిట్ లో మాత్రం తన ఆస్తుల విలువ రూ.330.14కోట్లుగా ప్రకటించారు. అంటే ఇది నమ్మశక్యం కానీ పెరుగుదల.. కేవలం 5 నెల్ల్లోనే 14.5 కోట్లు నుంచి 330 కోట్లు అంటే 2178 శాతం పెరుగుదల కనిపించింది.. ఈ ఆస్తుల పెరుగుదల చూసి ఆడిటర్లకే మతి పోయిందంటే అర్థం చేసుకోవచ్చు..

గత అక్టోబర్ లో గుంటూరులో విలేకరుల సమావేశం పెట్టి మరీ లోకేష్ తన కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రకటించారు. అందులో తన పేరు మీద 14.5 కోట్ల విలువైన ఆస్తులను ఉన్నట్లు ప్రకటించారు. అంటే అక్టోబర్ నుంచి ఇప్పటివరకు ఇన్ని కోట్లు పెరగడం చూస్తే లోకేష్ ప్రకటించిన ఆస్తుల విలువ తప్పైనా అయి ఉండాలి.. లేక పోతే అక్రమంగా ఈ 5 నెలల్లో కూడబెట్టిన సొమ్ము అయినా ఉండాలి.. లేకపోతే ఏ వ్యాపారికి సాధ్యం కానీ రీతిలో లోకేష్ ఇంతలా ఆస్తిలో పెరుగుదల చూపించడం విస్మయం కలిగిస్తోంది..

ఇదంతా ఒక్క లోకేష్ ఆస్తుల పెరుగుదల మాత్రమే.. ఇలానే ఏపీ సీఎం చంద్రబాబు, తల్లి నారా భువనేశ్వరీ, భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ ఆస్తుల విలువలను కూడా లోకేష్ తరహాలో చూపిస్తే వారి కుటుంబ ఆస్తులు ఎన్ని వేల కోట్లు దాటుతాయోనని రాజకీయాల్లో చర్చ సాగుతోంది. అధికారం అండతో ఇన్ని కోట్లు కూడబెట్టారా అని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరి అద్భుత ఆస్తుల పోగు వెనుక ఉన్న రహస్యాన్ని లోకేష్ వెల్లడిస్తే అందరూ ఫాలో అవడానికి సిద్ధంగా ఉన్నారు. లోకేష్ బాబూ ఆ చిట్కా చెప్పవూ..?

To Top

Send this to a friend