లోకేష్ తోపాటు మరో ముగ్గురికి చోటు!

రంగం సిద్దమైంది. ఉగాది కానుకగా ఏపీ కేబినెట్ ను పునర్ వ్యవస్థీకరించేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారు. కసరత్తు కూడా చేస్తున్నట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి. ఈ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో తన కొడుకు లోకేష్ తో మరో ముగ్గురికి చోటు కల్పించాలని సీఎం చంద్రబాబు అనుకుంటున్నట్టు సమాచారం. అందులో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ముగ్గురు సీనియర్ ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించబోతున్నట్టు తెలిసింది.. లోకేష్ తో పాటు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన భూమానాగిరెడ్డి(కర్నూలు), అమర్ నాథ్ రెడ్డి(చిత్తూరు), సుజయ్ రంగారావు(విజయనగరం)లను కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం.
వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వీరిని తొలుత రాజీనామా చేయించి గవర్నర్ వద్దకు పంపి ఆ తర్వాత అది జాప్యమైనా.. ఆమోదించినా తిరిగి ఎన్నికలకు వెళ్లైనా సరే ఆ ముగ్గురిని మంత్రులుగా చేయాలని బాబు ప్లాన్ చేసినట్టు సమచారం. వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత మంత్రులుగా తీసుకోనున్నట్టు ఆ ఎమ్మెల్యేలకు బాబు స్పష్టం చేశారట. దీంతో వచ్చే ఉగాదికి ఈ నలుగురు మంత్రులు ఏపీ క్యాబినెట్లోకి వస్తున్నట్టే.. కాగా తన కొడుకు లోకేష్ బాబును చంద్రబాబు తొలిసారి మంత్రివర్గంలోకి తీసుకుంటుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది..

To Top

Send this to a friend