లైవ్ లో రాజమౌళి ‘బాహుబలి ’


ఏప్రిల్ 28న విడుదలయ్యే బాహుబలి ట్రైలర్ కోసం అంతా సిద్ధం చేస్తున్న రాజమౌళి. నెలరోజుల ముందే సినిమా మొత్తం కంప్లీట్ చేసి డబ్బింగ్ పూర్తి చేసి రెడీ చేస్తున్నారు. మొన్ననే డబ్బింగ్ కంప్లీట్ చేసిన మూవీకి ప్రస్తుతం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

బాహుబలి2 ట్రైలర్ ఈ నెల 16న విడుదల కానుంది. దీన్ని హైదరాబాద్ లో ఉదయం 8-9 గంటల మధ్య ప్రెస్ మీట్ పెట్టి రాజమౌళి రిలీజ్ చేస్తారు. అనంతరం హైదరాబాద్ లోని అన్ని థియేటర్లలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుంది. అనంతరం ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లలో ఈ సినిమా ట్రైలర్ ను ఉదయం 9-10 గంటల మధ్యలో విడుదల చేస్తారు.
ఈనెల 16 న బాహుబలి ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభులు ఈరోజు ఫేస్ బుక్, ట్విట్టర్ లో లైవ్ ద్వారా పాల్గొని చెప్పారు. ఈ సందర్భంగా అభిమానుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. బాహుబలి1లో ఏదో ట్విస్ట్ లా కట్టప్ప బాహుబలిని చంపడం చూపామని కానీ అది దేశవ్యాప్తంగా ఇంత పెద్ద వైరల్ అవుతుందని ఊహించలేదని రాజమౌళి ఓ అభిమాని ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇంకా చాలా సంగతులు అభిమానులతో పంచుకున్నారు. ఫేస్ బుక్ లైవ్ వీడియో కోసం కింద లింక్ లో చూడొచ్చు..

To Top

Send this to a friend