లైట్ ఆఫ్ ల‌వ్ క్రియేష‌న్స్ `కొత్త‌కుర్రోడు`

DSC_7319
శ్రీరాం, మ‌హేంద్ర‌ర్ , ప్రియానాయుడు హీరో హీరోయిన్లుగా ప్రియ నాయుడు స‌మ‌ర్ప‌ణ‌లో లైట్ ఆఫ్ ల‌వ్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.మోహ‌న్ రావు ద‌ర్శ‌క‌త్వంలో ర‌మేష్ బ‌ద‌వ‌త్ నిర్మాత‌గా కొత్త చిత్రం హైద‌రాబాద్ లో శ‌నివారం ప్రారంభ‌మైంది. తొలి సన్నివేశానికి సి.క‌ల్యాణ్ క్లాప్ కొట్ట‌గా, తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ కెమెరా స్విచ్చాన్ చేశారు. స‌త్యారెడ్డి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అనంత‌రం జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో….
చిత్ర ద‌ర్శ‌కుడు ఎస్‌.మోహ‌న్ రావు మాట్లాడుతూ “ఆక‌తాయిగా తిరిగే ఓ కుర్రాడు ఒక గ్రామ సర్పంచ్ కూతురిని పెళ్లి చేసుకుంటే కోటీశ్వ‌రుడు అయిపోవ‌చ్చు అని తెలుసుకుని ఆ వూరు వెళ్లి ఎలా ఇబ్బందులు ప‌డ్డాడు. అమ్మాయి ప్రేమ‌ను ఎలా ద‌క్కించుకుంటాడనేదే క‌థ‌. త‌న‌తో పాటు త‌న స్నేహితుడు ప్రేమ‌ను ఎలా స‌క్సెస్ చేశాడ‌నేదే క‌థ‌. యూత్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. అంద‌రికీ న‌చ్చే చిత్ర‌మ‌వుతుంద‌ని క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను. హైద‌రాబాద్‌, రాజ‌మండ్రి, రామ‌చంద్రాపురం, పాల‌కొల్లులో సినిమా చిత్రీక‌ర‌ణ చేస్తాం“ అన్నారు.
చిత్ర నిర్మాత మాట్లాడుతూ “కొత్త న‌టీన‌టుల‌తో చేస్తున్న సినిమా. మంచి యూత్‌, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. మంచి టీం కుదిరింది. ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ న‌చ్చింది“ అన్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః స‌తీష్‌, మ్యూజిక్ః ఎలెన్ ధ‌ర్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః ఎస్‌.రాజా నాయుడు, ప్రొడ్యూస‌ర్ః ర‌మేష్ బ‌ద‌వ‌త్‌, డైరెక్ట‌ర్ః ఎస్‌.మోహ‌న్ రావు.
To Top

Send this to a friend