లింగబేధం లేదు..మగాళ్లు..ఆడాళ్లు..

అరె… ఏం ప్రపంచంరా బాబు.. మగాళ్లు ఆడవాళ్లు అవుతున్నారు.. ఆడవాళ్లు మగాళ్లైపోతున్నారు. ప్రపంచమే కుగ్రామంగా మారిన ఈ పరిస్థితుల్లో లింగబేధం లేకుండా పోతోంది. ఇండియాలో ఇప్పుడిప్పుడే మొదలైన సంస్కృతి విదేశాల్లో మాత్రం ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. బ్రిటన్ లో ఓ మగాడు.. బిడ్డకు జన్మనివ్వడం సంచలనంగా మారింది. అయితే అతడు మగాడుగా మారక జన్మనివ్వడమే విశేషమైంది..21ఏళ్ల హెడెన్ క్రాస్ అనే పురుషుడు.. మొదట స్త్రీగానే జన్మించాడు. అయితే మగడిగా ప్రవర్తించడం చూశాక.. పెద్దయ్యాక హర్మోన్ చికిత్స చేయించుకొని కంప్లీట్ పురుషుడిగా మారారు.

బిట్రన్ ప్రభుత్వంలో హెడెన్ పురుషుడిగా హార్మోన్ చికిత్స చేయించుకున్నాక ప్రభుత్వ జాతీయ ఆరోగ్య సేవల సంస్థలో పురుషుడిగానే నమోదు చేయించుకున్నాడు. మరికొన్ని చికిత్సల తర్వాత పూర్తిగా పురుషుడిగా మారబోతున్నాడు.
హెడెన్ పురుషుడిగా మారాక కూడా అతడి శరీరంలో స్త్రీ అవయవాలు, లక్షణాలు అలానే ఉన్నాయి.

ఇప్పటికీ అతడికి స్త్రీలాగా అండాలు విడుదలవుతూనే ఉన్నాయి. అందుకే అతడి అండాలను శీతలీకరించి భద్రపరుచుకున్నాడు. మధ్యలో తాను తండ్రికావలని అనుకొని అండాలను.. ఫేస్ బుక్ లో వీర్యదాతలను సంప్రదించి ఫలదీకరించి చేయించి గర్భం దాల్చాడు. దాత వీర్యకణాలతో తను గర్భం దాల్చి జూన్ 16న పాపకు జన్మనిచ్చాడు. అయితే ప్రస్తుతం ఓ బిడ్డకు జన్మనిచ్చిన తొలి పురుషుడిగా (బ్రిటన్ రికార్డుల ప్రకారం) హెడెన్ చరిత్ర సృష్టించాడు.

To Top

Send this to a friend