లహరి ద్వారా ‘మన్యం పులి ‘ ఆడియో

5g6a3288-copy

మళయాలీ మెగాస్టార్ మోహన్ లాల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పులిమురుగన్ తెలుగనాట మన్యం పులి విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ వారు ‘యు’ రేటింగ్ ఇచ్చారు. డిసెంబర్ 2న సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు నిర్మాత సింధూరపువ్వుకృష్ణారెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ కంపోజ్ చేసిన ఆడియోను తెలుగునాట ప్రముఖ ఆడియో కంపెనీ లహరి వారు విడుదల చేయడం విశేషం. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ గోపీ సుందర్ ఈ సినిమాకు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారని, లహరి మ్యూజిక్స్ ద్వారా ఈ సినిమా ఆడియో విడుదల కావడం చాలా ఆనందంగా ఉందని, శ్రోతల్ని కచ్ఛితంగా మన్యంపులి ఆడియో ఆకట్టుకుంటోందని తెలిపారు. త్వరలోనే చిత్ర ప్రి రిలీజ్ ఫంక్షన్ నిర్వహించేందుకు మన్యం పులి యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. దాదాపు రెండుసంవత్సరాలు పాటు ఈ సినిమాను కేరళ, వియత్నాం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. పీటర్ హేన్స్కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలుస్తాయని, పెద్దలతో పాటు చిన్నపిల్లలు కూడా మన్యం పులి కోసం ఎదురుచూస్తున్నట్లుగా చిత్ర బృందం తెలిపింది. జగపతి బాబు, కమలినీముఖర్జీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వైశాఖ దర్శకత్వం వహించాడు, కథ : ఉదయ కృష్ణ,సంగీతం : గోపీ సుందర్, కెమెరా : షాజీ కుమార్, బ్యానర్ : సరస్వతి ఫిల్మ్స్.

 

To Top

Send this to a friend