లక్షలు జమ చేసిన వారికి మోడీ షాక్..

అనుకున్నట్టే అయ్యింది.. పెద్ద నోట్ల రద్దు అనంతరం మోడీ తన ప్రతాపాన్ని చూపారు.. బ్లాక్ మనీని పోగేసి దాన్ని వైట్ చేసుకునేందుకు బ్యాంకు అకౌంట్లలో లక్షలు జమ చేసిన కుబేరుల ఆటను మోడీ కట్టించారు. నిన్న ఒక్కరోజే అనుమానాస్పదంగా లక్షలు జమ అయిన దాదాపు 13 లక్షల ఖాతాదారులకు ఐటీశాఖ ద్వారా నోటీసులు అందాయి. కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి చైర్మన్ సుశీల్ చంద్ర  సారథ్యంలో లక్షల జమ అయిన ఖాతాదారులు వివరణ ఇవ్వాలంటూ దేశ వ్యాప్తంగా 13 లక్షల మందికి ఈమెయిళ్లు, ఎస్ఎంఎస్ లు పంపారు..

పెద్దనోట్లు రద్దు అయ్యాక దేశవ్యాప్తంగా దాదాపు రూ.4.17 లక్షల కోట్లు వివిధ ఖాతాల్లో అక్రమంగా జమ అయినట్టు కేంద్ర ఐటీశాఖ గుర్తించింది. ఇన్నాళ్లు మోడీ నల్ల కుబేరుల భరతం పడతానని కేవలం మాటలే అన్నాడు. కానీ గురువారం తో చర్యలకు దిగాడు. గురువారం 13 లక్షల మందికి నోటీసులు ఇచ్చిన కేంద్రం.. సరైనా సమాధాన రాకపోతే జమ చేసిన మొత్తానికి జరిమానా విధించి వసూలు చేయాలని నిర్ణయించింది.. అంతేకాదు.. మరో 5 లక్షల అనుమానాస్పద ఖాతాదారులకు శుక్రవారం నోటీసులు అందజేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ దెబ్బతో బ్యాంకు ఖాతాల్లో లక్షలు జమ చేసిన కుబేరులకు ముచ్చెమటలు పడుతున్నాయి..

To Top

Send this to a friend