ఓ వైపు నిర్మాతగా భారీ చిత్రాలు నిర్మిస్తూ, డిస్ట్రిబ్యూషన్ రంగంలో మంచి తెలుగు చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పకుడిగా, వరుస బ్లాక్‌బస్టర్స్ కథలతో సూపర్‌డూపర్ సక్సెస్ లతో దూసుకుపోతున్న దర్శకుడు మారుతి కథ, స్క్రీన్‌ప్లే అందించగా, మారుతి టాకీస్ బ్యానర్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్స్ పై రూపొందుతోన్న చిత్రం ‘రోజులు మారాయి’. మురళీకష్ణ ముడిదాని దర్శకత్వంలో జి.శ్రీనివాసరావు నిర్మాతగా ఈ చిత్రం రూపొందింది. జె.బి. సంగీతం అందించిన ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది.
ఈ కార్యక్రమంలో దిల్‌రాజు, మారుతి, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, అనిల్ రావిపూడి జి.నాగేశ్వరరెడ్డి, సాయిరాజేష్, దశరథ రామిరెడ్డి, హీరో రోహిత్, సత్యానంద్, కల్వకుంట్ల తేజేశ్వరరావు, ఉద్ధవ్, చేతన్, పార్వతీశం, తేజస్వి, కృతిక, ఆదిత్య నిరంజన్, డార్లింగ్ స్వామి, సీతారాం తదితరులు పాల్గొన్నారు.
థియేట్రికల్ ట్రైలర్ ను అనిల్ రావిపూడి విడుదల చేశారు. బిగ్ సీడీ, ఆడియో సీడీలను దిల్ రాజు విడుదల చేశారు.
