రైతు అకౌంట్లో రెండు కోట్ల జమ.. నల్లకుబేరుల ప్రయత్నం

demonetisation

దేశంలో నల్లడబ్బు కుప్పలుగా ఉందని తెలుసు కనుకే మోడీ అలా నోట్లు రద్దు చేశారు. ఇన్నాల్లు పోగేసుకుంది కొద్దిగా బయటపడుతోంది. డిసెంబర్ 30 పాతనోట్ల డిపాజిట్ కు చివరిరోజు కావడంతో నల్లకుభేరులు అమాయకులను ఆసరాగా చేసుకొని వారి ఖాతాల్లో కోట్లు జమచేసి విత్ డ్రా చేసుకుంటున్నారు. కర్నూలులో ఓ రైతు అకౌంట్లో ఇలానే రెండు కోట్లు జమ చేయడం కలకలం రేగింది. 30న చివరిరోజు కావడంతో దాదాపు కోటి96 లక్షల డబ్బులను రైతు అబ్రహం అకౌంట్లో ఓ పరిశ్రమ నిర్వాహకులు డిపాజిట్ చేశారు. రైతుకు ఆమేరకు మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత సాయంత్రానికి రైతు అకౌంట్ల నుంచి డబ్బులు విత్ డ్రా అయిపోయాయి.
ఈ పరిణామాలతో హతాశుడైన రైతు స్థానికులకు మీడియాకు సమాచారం అందించారు. ఆంధ్రా గ్రామీణ బ్యాంకు నుంచి ఈ డబ్బులు డిపాజిట్ అయ్యాయని తెలిసి అధికారులు విచారణ జరుపుతున్నారు. రైతు ఖాతాలో జమ కావడంతో తనకు ఏం జరుగుతుందో అరెస్ట్ చేస్తారోనని భయంతో వనికిపోతున్నాడు. నల్లకుబేరులు అమాయకుల అకౌంట్లలో డబ్బులు జమ చేసి ఇలా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దేశంలో నల్లడబ్బు ఎంత పేరుకుపోయిందో తెలియడానికి ఇదో ఉదాహరణ..

To Top

Send this to a friend