రైతుల పక్షాన చంద్రబాబుతో యుద్ధం.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గర్జించాడు. రైతుల కన్నీరు చంద్రబాబు ప్రభుత్వానికి మంచిది కాదని హెచ్చరించాడు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలోని మూలలంక, అమరావతి ప్రాంతంలోని లంక భూములను కొల్లగొడుతున్న చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని.. వారికి భారీ నష్టపరిహారం అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ట్విట్టర్ లో స్పందించిన పవన్.. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం రైతుల పట్ల అవలంభిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

పోలవరంలో చంద్రబాబు ప్రభుత్వం రైతుల భూములు లాక్కుంటూ అన్యాయం చేస్తున్నారని.. పోలవరం సమీపంలోని మూలలంకలో 207 ఎకరాల మాగాణి భూమిని రైతుల అంగీకారం లేకుండా డంపింగ్ యార్డుగా మారుస్తారా అని పవన్ ప్రశ్నించారు. టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కు చెందిన పోలవరం కాంట్రాక్ట్ కంపెనీ ప్రభుత్వం అండతో రైతుల భూముల్ని నిరంకుశంగా లాక్కొని డంపింగ్ యార్డుగా మార్చేస్తే ప్రభుత్వం నిద్రపోతోందా..? అని పవన్ మండిపడ్డారు. పోలవరంపై సమీక్షిస్తూ.. నిధులు తెస్తూ వేగంగా చేస్తున్న చంద్రబాబు.. రైతులను మాత్రం రోడ్డున పడేయడం న్యాయమా అని నినదించారు. నష్టపరిహారం ఇమ్మని రైతులు కోరితే వారిమీద కేసులు పెట్టి వాళ్ల నోళ్లు మూయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులమైనందుకే పరిహారం చెల్లింపులో వివక్షకు గురిఅవుతున్నామని బాధిత రైతులు ఆవేదన చెందుతున్నా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ గ్రీన్ ట్య్రిబ్యూనల్ ప్రకారం నదీ పరివాహక ప్రాంత భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని.. భూముల సేకరణకు ముందు ఎంమేరకు నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం చెప్పిందో అంతే ఇవ్వాలని పవన్ కోరాడు. నిర్మాణలు చేపట్టకుంటే ఆ భూముల్ని రైతులకు వదిలేయాలని పవన్ ప్రభుత్వాన్ని కోరాడు..

ఇలా ఒక్కో అంశంపై ఒక్కో గునపంలా సంధించిన పవన్ ట్వీట్టు ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. పవన్ తన ట్వీట్లలో పోలవరం నిర్వాసితుల గోడును.. అమరావతి లంక గ్రామాల రైతుల దీనగాథను ప్రజల ముందు ఉంచారు. వారిని మీడియా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని.. ప్రభుత్వం వారి భూములు లాక్కొని పరిహారం ఇవ్వకుండా రోడ్డున పడేస్తోందని వాపోయాడు. చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టులు, అభివృద్ది పనుల పేర చేపడుతున్న ఈతంతులో అమాయక రైతులు బలి అయి పోతున్నారని పవన్ సూటిగా ప్రశ్నించారు. ఈ వరుస ట్వీట్లతో ఓ రకంగా చంద్రబాబుపై పవన్ యుద్ధమే ప్రకటించాడని చెప్పొచ్చు.. చంద్రబాబు ప్రభుత్వం తెరవెనుక చేస్తున్న ఈ తంతంగాలపై జనసేనాని పోరుబాట ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

To Top

Send this to a friend