రైతుదా.? ప్రకృతిదా.? కేసీఆర్ , బాబులదా.?


ఈ పాపం ఎవరిదైనా బలైపోయింది మాత్రం రైతే.. గడిచిన ఖరీఫ్ లో విస్తారంగా వర్సాలు పడ్డాయి. తెలంగాణ, ఏపీల్లోని ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. దీంతో ఈ సారి రబీలో రైతులు గడిచిన ఖరీఫ్ కంటే ఎక్కువే పంటలు వేశారు. దిగుబడి బాగా వస్తుందని ఆశించారు.. కానీ చివరకు మండే ఎండలకు భూగర్భ జలాలు అడుగంటాయి. ప్రాజెక్టులు, చెరువుల్లో నీరు అడుగంటింది. పంటలు చేతికొచ్చే వేళ నీళ్లు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయి. దీంతో ఆరుగాలం కష్టించిన రైతు అప్పుల పాలయ్యాడు..

ప్రభుత్వాల అసమర్థ కూడా ఈ పంటలు ఎండడం లో కీలకపాత్ర పోషించాయి. ఆరుతడి పంటలను వేయాలని రైతులకు అవగాహన కల్పించడంలో చంద్రబాబు, కేసీఆర్ విఫలమయ్యారు. నీళ్ళున్నాయని రైతులు వరి వేసి ఇప్పుడు నీళ్లందక ఎండిపోతుంటే రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రకృతి కూడా పగబట్టినట్టు నీటి జాడ లేకుండా భూగర్భ జలాలను అడుగంటిస్తోంది. దీంతో వీటన్నింటి మధ్య పాపం సాగు చేసిన రైతన్న పంటలు ఎండిపోయి అప్పుల పాలయ్యారు.

దేశంలో ఈసారి విస్తారంగా వర్షాలు కురిసినా ఎండల దాటికి నీటి జాడ కరువైంది. పంటలు కాపాడుకోలేకపోతున్నాం.. గ్రామాల్లో అయితే నీటికొరత ఏర్పడి వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి గ్రామస్థులు నీటిని తెచ్చుకుంటున్నారు. అయినా ప్రభుత్వాల్లో కదిలిక రావడం లేదు. రైతులను ఆదుకునేందుకు .. గ్రామాల్లో నీటికొరత తీర్చేందుకు కేసీఆర్, చంద్రబాబు సర్కారులు ఇప్పటివరకు చర్యలు చేపట్టకపోవడం శోచనీయం.

To Top

Send this to a friend