రేప్ చేసిన మంత్రి జైలుకు..


యూపీలో ప్రజలు ప్రధానంగా ఆలోచించింది శాంతిభద్రతలే.. అక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలే అత్యాచార నిందితులుగా ఉన్నారు. అయినా కులమత, వర్గ రాజకీయాల్లో భాగంగా అఖిలేష్ సర్కారు అలాంటి నీచులను పదవుల్లో కొనసాగిస్తూ వచ్చింది. ఇక ఇంతటి దుర్మార్గులు రాజ్యమేలుతుండడంతో కింది స్థాయి వారు మహిళలు, విద్యార్థునులపై కీచకులు పడి అత్యాచార పరంపరలు కొనసాగేవి. అందుకే యూపీ ప్రజలను నోట్ల రద్దు కంటే కూడా ఎక్కువ బాధించింది శాంతిభద్రతల లోపం.. ప్రజలకు రక్షణ లేకపోవడం.. అందుకే దేశరక్షణ, శాంతిభద్రతల విషయంలో నిక్కచ్చిగా ఉండే బీజేపీకి అక్కడి ప్రజలు పట్టం కట్టారు. అన్నట్టుగానే బీజేపీ యూపీలో అధికారంలోకి రాగానే పంజా విసిరింది..

తల్లీకూతుళ్లపై రేప్ చేసి ఫిబ్రవరి 27 నుంచి పరారీలో ఉన్నారు మంత్రి గాయత్రి ప్రజాపతి. ప్రజాపతి రేప్ కేసులో ఇరుక్కున్నా అక్కడి అఖిలేష్ సర్కారు అతడిని మంత్రివర్గంలోనుంచి తొలగించలేదు. పైగా గవర్నర్ తొలగించాలని సీఎం అఖిలేష్ కు లేఖ రాసినా కూడా ఆయన స్పందించక కొనసాగించడం దుమారం రేపింది.
యూపీ ఎన్నికల్లో ఓటు హక్కును బహిరంగంగా వచ్చి వినియోగించుకున్నా కూడా పోలీసులు అతడిని అరెస్ట్ చేయకపోవడం విమర్శలకు తావిచ్చింది. కానీ బీజేపీ అధికారంలోకి రాగానే వారి ఆదేశాలతో పోలీసులు లక్నోలో అతడిని అరెస్ట్ చేశారు.

అయితే గడిచిన యూపీ ఎన్నికల్లో అంబేద్కర్ నగర్ లో ప్రచారం నిర్వహించిన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తాము అధికారంలోకి రాగానే శాంతిభద్రతలను పరిరక్షిస్తామని.. అత్యాచారం చేసిన మంత్రి ప్రజాపతిని అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. అనుకున్నట్టే యూపీలో బీజేపీ గెలిచి ఇంకా అధికారం చేపట్టకముందే ప్రజాపతిని అరెస్ట్ చేసి జైలుకు తరలించడం విశేషం. ఈ పరిణామాలు బీజేపీపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని నిలబెట్టినట్టు అయ్యాయి.

To Top

Send this to a friend