రెడ్లందరూ ఒక్కటేనబ్బా.. ఇదీ కోదండ లెక్క


టీఆర్ఎస్ వోళ్లు చెబుతుంది అదే కదా.. ఈ రెడ్డి.. ఆ రెడ్లతో కలిసిపోయాడని… నమ్మితే కదా.. ఇప్పుడైనా నమ్మండి.. రెడ్డి-రెడ్డి కలిసిపోయా దొరల రావుల మీద పడుతున్నరు.. అందుకే కదా కేసీఆర్ కు కోదండరాం రెడ్డికి మధ్య విభేదాలొచ్చినయి. ఎనకో ఎవరో నడిపిస్తున్నారనే కదా కేసీఆర్ కోదండను అనుమానిస్తున్నది.. అదే నిజమవుతున్నది. కోదండకు కేసీఆర్-టీఆర్ఎస్ కు దూరంగా.. కాంగ్రెస్ కు దగ్గరగా జరుగుతున్నారు. నిన్న ఏకంగా కాంగ్రెస్ కు సపోర్టుగా మాట్లాడి తన మనసులో ఇదే ఉందని తేటతెల్లం చేశాడు..

ఆంధ్రలో ఉన్నట్టు తెలంగాణలో పెద్దగా కులసమీకరణాలు ఎక్కువగా ఉండవు. తెలంగాణలో ఎక్కువగా రెడ్ల కుల ఆధిపత్యమే కొనసాగుతుంది. పోయిన కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డిల ప్రోద్బలంతో తెలంగాణలో రెడ్ల నాయకులే లబ్ధి పొందారు. అందుకే కాంగ్రెస్ అధిష్టానం కూడా శాసనసభాపక్షనేతగా అటు జానారెడ్డిని, ఇటు పీసీసీ చీఫ్ గా బీసీ వర్గానికి చెందిన పొన్నాల లక్ష్మయను ఊడబీకి ఉత్తమ కుమార్ రెడ్డికి కట్టబెట్టింది. బీసీ నాయకులను తెలంగాణలో ఆదినుంచి ఎదగనీయడం లేదు. అధికారాన్ని కైవసం చేసుకోనీయడం లేదు. పైగా తమకు వైరంగా ఉన్న వెలమ రావులను ఆదినుంచి వీరు సహించరు.. అందుకే లాబీయింగ్ మొదలుపెట్టారు. అనధికార ముచ్చట్లు పెట్టారు. అందుకే తమ కులస్థుడైన కోదండరాంను తెరవెనుక నడిపిస్తున్నారని టీఆర్ఎస్ వాళ్లు విమర్శిస్తున్నారు. అది నిజమో కాదో తెలియదు కానీ ఈ వెలమ-రెడ్ల వైరంను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం అది నిజమేనని అనిపిస్తోంది..

తాజాగా కోదండరాం టీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు.. ఉద్యోగాల విషయంలో ఇప్పటికే టీఆర్ఎస్ పై యుద్ధానికి దిగిన కోదండరాం ఆదివారం ఏకంగా తన చూపు ఎటువైపో చెప్పకనే చెప్పారు. ‘‘రాష్ట్రంలో ఎక్కువ ఉద్యోగాలిచ్చింది కాంగ్రెసేనని కుండబద్దలు కొట్టారు. టీఆర్ఎస్ సగటు కన్నా కాంగ్రెస్ ఇచ్చిన ఉద్యోగాల సగటే ఎక్కువనని స్పష్టం చేశారు. ఉద్యోగాలిచ్చింది ఎక్కువ మేమేనని అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్ తీరు ఆశ్చర్యకరమన్నారు. ఉద్యోగాలివ్వని తెలంగాణ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది ఎందుకని ప్రశ్నించారు. ’’ ఇలా టీఆర్ఎస్ పై అక్కసు వెళ్లగక్కి కాంగ్రెస్ పై ఆవాజ్య ప్రేమను కనబరిచారు. ఈ ప్రకటనతో కంప్లీట్ గా కోదండ  కాంగ్రెస్కు టర్న్ తీసుకున్నట్టైంది. టీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టు కాంగ్రెస్ ఏజెంట్ అన్నదానికి మద్దతుగా కోదండ వ్యాఖ్యలు వినిపించాయి.

To Top

Send this to a friend