రెండు కొత్త ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్

వాట్పాప్ విప్లవాత్మక మార్పుల దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కొన్ని హై ఎండ్ ఫోన్లలో వీడియో కాలింగ్ ను అందుబాటులోకి తెచ్చి ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న వాట్సాప్ యాజమన్యం.. ఇప్పుడు వాట్సాప్ బీటా పేరుతో కొన్ని వెర్షన్ల ఫోన్లలో రెండు కొత్త ఫీచర్లను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది.. గ్రూపు చాట్ లలో లైవ్ లోకేషన్ ఫీచర్ ను వాట్సాప్ అందులో ప్రవేశపెట్టింది. దీంతో గ్రూపు సభ్యుల్లో ఎవరు ఎక్కడున్నారో నన్న విషయం గ్రూపులోని సభ్యులకు తెలిసిపోతుందన్నమాట.. ఫేస్ బుక్ లో లోకేషన్ ఫీచర్ లాగే వాట్సాప్ లో కూడా కనిపిస్తుందన్నమాట.. సభ్యులంతా ఒక చోట కలుసుకోవాలని అనుకున్నప్పుడు ఎవరెంత దూరంలో ఉన్నారో ఈ కొత్త ఫీచర్ల వల్ల మనకు తెలుసుకోవచ్చు..

ప్రయోగాత్మకంగా చేపట్టిన దీన్ని త్వరలోనే అమలు చేసేందుకు వాట్సాప్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. అమలులోకి వచ్చాక వాట్సాప్ వినియోగదారులు గ్రూపులోకి వెళ్లి ‘షో మై ఫ్రెండ్స్’ అనే ఆప్షన్ ను యాక్టివేవేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మరో ఆప్షన్ ను కూడా వాట్సాప్ జోడిస్తుంది.. ఇన్నాళ్లు మనం వాట్సాప్ లో ఏదైనా పోస్టు చేస్తే దాన్ని డిలేజ్ చేయవచ్చు కానీ.. ఎడిట్ చేయడానికి వీల్లేకుండా ఉండేది… కానీ ఈ సారి ఒకసారి పంపిన మెసేజ్ లను మళ్లీ ఎడిట్ చేసి పంపే సౌకర్యాన్ని కూడా వాట్సాప్ అందుబాటులోకి తెస్తోంది.. ఇవీ అందుబాటులో వస్తే మెసేజ్ ఎడిట్.. తో పాటు లోకేషన్ ను తెలుసుకునే వెసులుబాటు వినియోగదారులకు దక్కుతుందన్న మాట..

To Top

Send this to a friend