రూ.3 లక్షలు దాటితే మీ పని గోవిందా!

 

నగదు లావాదేవీల కట్టడికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.. ఈ బడ్జెట్ లో ఈ మేరకు ప్రతిపాదనలు పంపింది.. మూడు లక్షల రూపాయలకు మించిన నగదు లావాదేవీలు ఏప్రిల్ ఒకటో తేది నుంచి నిషేధించారు. ఆదాయపు పన్ను చట్టంలో ఈ మేరకు సవరణలకు కేంద్ర ప్రభుత్వం చేస్తోంది.. బడా వ్యాపారులకు ఇది శరాఘాతంగా మారనుంది. అమ్మకం, కొనుగోలు దారులకు ఇది ఇబ్బందులు సృష్టిస్తుంది.. ఒకే లావాదేవీలో రూ.3 లక్షలకు మించి నగదు చేయి మారితే అది తీసుకున్న వారికి పెను ముప్పుగా మారనుంది.. ఆదాయపు పన్ను శాఖకు దొరికితే మొత్తానికి రెట్టింపు ఫైన్ గా చెల్లించాల్సి ఉంటుంది..

అయితే ఈ ఆదాయపు పన్ను చట్టంలో నిబంధనలు బ్యాంకులకు వర్తించవు.. ఒక వ్యక్తి విడతలుగా ఒకే రోజు 3 లక్షలకు మించి నగదు తీసుకున్నా.. ఏక మొత్తంలో ఒకేసారి 3 లక్షలకు నగదు తీసుకున్నా బ్యాంకులకు, వినియోగదారులకు వర్తించదు.. వారిపై ఎలాంటి కేసులు ఉండవు. ప్రభుత్వ లావాదేవీలు, బ్యాంకులు, పోస్టాఫీసుకు, సహకార బ్యాంకులకు ఈ నిబంధన వర్తించదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది..

To Top

Send this to a friend