రూ.14కే అపరిమిత ఇంటర్నెట్, ఐడియా అద్భుత ఆఫర్

ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో దెబ్బకు టెలికాం ఆపరేటర్లన్నీ బెంబేలెత్తుతున్నాయి. జియో ఫ్రీ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ సహా అన్ని సేవలను ఉచితంగా అందిస్తున్న దరిమిలా.. టెలికాం ఆపరేటర్లు ఆ పోటీని తట్టుకునేందుకు కుప్పిగంతులు వేస్తున్నాయి. జియోను కాచుకోవడానికి ఇప్పటికే అన్ లిమిటెడ్ కాల్స్, డేటా ప్యాకులను ప్రకటించిన ఐడియా, ఎయిర్ టెల్, వోడాఫోన్ లు ఇప్పుడు తక్కువ ధరకే అన్ లిమిటెడ్ ప్యాక్ ను అందుబాటులోకి తెచ్చాయి.

ఆదివారం ఐడియా సెల్యూలర్ అద్భుత ఆఫర్ ను ప్రకటించింది.. రూ.14తో రీచార్జి చేసుకుంటే అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ ను పొందవచ్చని ప్రకటన విడుదల చేసింది.. ఈ ఆఫర్ జనవరి 19నుంచే అందుబాటులోకి వచ్చినట్టు తెలిపింది.. కాగా ఐడియాకంటే ముందే వోడాఫోన్ రూ.16 రీచార్జితో ఈ ఆఫర్ ను ప్రకటించింది. దాన్ని చూసి రెండు రూపాయలు తగ్గించి ఐడియా ఈ కొత్త ఆఫర్ ను ప్రకటించింది. ఇలా జియో ధాటికి ఒక్కో కంపెనీ మెట్టుదిగి వినియోగదారులు మారకుండా వరాలు కురిపిస్తున్నాయి. ఐడియా, వోడాఫోన్ ప్లాన్ లు ప్రకటించడంతో ఎయిర్ టెల్,ఇతర కంపెనీలు కూడా ఇలానే ప్లాన్లు ప్రకటించేందుకు రెడీ అయ్యాయని సమాచారం.

To Top

Send this to a friend