రిటైర్ అవ్వమని సచిన్ కు చెప్పింది ఎవరో తెలుసా..


ఇటీవలే సోషల్ మీడియా సైట్ లింక్డిన్ లో చేరిన సచిన్ తన అనుభవాల్ని అభిమానులతో పంచుకున్నారు.. తాను ఇంకొద్దికాలం క్రికెట్ లో కొనసాగుదామని అనుకున్నానని.. కానీ తన శరీరంలో వచ్చిన మార్పును చూసే ఇక రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.

‘‘2013 అక్టోబర్ నెలలో తన శరీరం, మనసు కూడా పూర్తిగా క్రికెట్ కు అనుకూలించడం మానేశాయి. అప్పుడే అనిపించింది ఇక అంతర్జాతీయన క్రికెట్ కు వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైందని.. ఆ క్రమంలోనే చాంపియన్స్ లీగ్ ఆడే మ్యాచ్ ల్లో లంచ్ టీ విరామం సమయం అప్పుడే అనుకున్నా.. అందుకే సరిగ్గా ఆ ట్రోఫీ అయిపోగానే రిటైర్ మెంట్ ప్రకటించా.. ’’ అని సచిన్ తన రిటైర్ మెంట్ సంగతులు చెప్పుకొచ్చారు.

ఇక తనకు టెన్నిస్ క్రీడాకారిణి బిల్లీజీన్ కింగ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నానని.. ‘నువ్ ఎప్పుడు రిటైర్ కావాలన్నది ప్రపంచం నిర్ణయించకూడదని.. నువ్వే నిర్ణయించుకోవాలని’ ఆమె చెప్పిన విషయాలను గుర్తు చేసుకున్నానని తెలిపారు. ఆ తర్వాత నెలకి తాను రిటైర్ మెంట్ తీసుకున్నానని.. 2013 నవంబర్ 14న ముంబైలో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ ద్వారా సచిన్ తన అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాని సచిన్ వివరించారు.

To Top

Send this to a friend