రిటెర్న్ బ్యాక్.. శ్రీముఖికి లక్కీ చాన్స్

చంద్రిక లాంటి హర్రర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ శ్రీముఖి ఆ తర్వాత ఆశించిన విజయాలను దక్కించుకోలేదు.. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెకు సోలో హీరోయిన్ గా అవకాశం రాలేదు. దీంతో అటు నుంచి యాంకర్ గా స్థిరపడింది. ప్రస్తుతం మాంచి ఫామ్ లో ఉంది. మధ్యలో వచ్చిన పెద్ద సినిమాల్లో చిన్న క్యారెక్టర్ లు చేస్తూ సర్ధుకుంటోంది.. ప్రేమ ఇష్క్ కాదల్, ధన్ రాజ్ ‘లక్ష్మీ దేవీ తలుపు తట్టింది’ లాంటి చిన్న సినిమాలు చేసింది. బన్నీ సినిమా అల్లు అర్జున్ సిస్టర్ గా.. నాని జెంటిల్మన్ లో నటించింది.. హీరోయిన్ గా అవకాశాలు లేకపోవడంతో దొరికిన అవకాశాన్నే చేసుకుంటూ వస్తోంది..

ఇక సంక్రాంతి కానుకగా యాంకర్ , హీరోయిన్ శ్రీముఖికి అద్భుత ఆఫర్ దక్కింది.. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే., మనం లాంటి హిట్ సినిమాలకు డైలాగుల రాసి పేరు తెచ్చుకున్న హర్షవర్ధన్ కొత్తగా ఓ సినిమా చేస్తున్నాడు. డైరెక్టర్ గా ఆయన చేయబోయే తొలిచిత్రానికి హీరోయిన్ గా శ్రీముఖిని ఎంచుకున్నారు.. అది కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో శ్రీముఖికి బాగా పేరొచ్చే అవకాశాలున్నాయి. ‘గుడ్, బ్యాడ్, అగ్లీ’ అనేది ఈ మూవీ కి పేరుగా అనుకున్నారట.. దీంతో శ్రీముఖికి మళ్లీ రోజులు కలిసివచ్చినట్టే కనపడుతున్నాయి..

To Top

Send this to a friend