రాహుల్‌ మూవీ మేకర్స్‌  ‘ఎల్‌7’ 21 న విడుదల

tsn_3414
రాహుల్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఆదిత్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఎల్‌ 7’. పూజా జావేరి కథానాయిక. ‘ఇష్క్‌’, గుండెజారి గల్లంతయ్యిందే’, ‘మనం’ చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ విభాగాల్లో పనిచేసిన ముకుంద్‌ పాండే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఈవర్షం సాక్షిగా’ వంటి హిట్‌ చిత్రాన్ని అందించిన బి.ఓబుల్‌ సుబ్బారెడ్డి నిర్మిస్తున్నారు. నిర్మాత బి.ఓబుల్‌ సుబ్బారెడ్డి  మాట్లాడుతూ “మా హీరో ఆదిత్‌ క్యారెక్టర్‌ సినిమాకు హైలైట్‌ అవుతుంది. పూజా నటనకు ప్రాధాన్యమున్న పాత్ర చేసింది. ఇటీవల ప్రమోషన్ నిమిత్తం వైజాగ్, రాజమండ్రి, తిరుపతి, చిత్తూర్, పుత్తూరు, గుంటూరు, విజయవాడ ఇతర ప్రదేశాలలో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, సోషల్ సర్వీస్ ఆక్టివిటీస్ నిర్వహించాము. ఇటువంటి కార్యక్రమాల ద్వారా మా సినిమా యూనిట్ కి జనాల్లో మంచి రెస్పాన్స్ బాగుంది. చాలామంది మాకు ఫోన్ చేసి మీ ట్రైలర్స్, టీజర్స్  చూసాము చాల బాగున్నాయి.. అంటున్నారు. మా బ్యానర్‌లో మంచి సినిమా అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్ని ముగించుకొని ఈ నెల 21 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఓవర్సీస్ లో ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నాము” అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: దుర్గాప్రసాద్‌, సంగీతం: అరవింద్‌ శంకర్‌, ఆర్ట్‌: నాగసాయి, సమర్పణ: మాస్టర్‌ ప్రీతమ్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిషోర్‌, కో.ప్రొడ్యూసర్‌: బి.మోహనరావు, సతీష్‌ కొట్టె, పున్నయ్య చౌదరి. నిర్మాత :  బి.ఓబుల్‌ సుబ్బారెడ్డి
To Top

Send this to a friend