రాసలీలల మరో గవర్నర్ .. రాజీనామా

అప్పుడెప్పుడో ముసలాయన.. వృద్ధుడు.. పైగా ఉమ్మడి ఏపీ గవర్నర్ గా కొనసాగిన ఎన్డీ తివారీ రాసలీలలు పెద్ద సంచలనమే సృష్టించాయి. కాటికి కాలు చాపిన ఎన్డీ తివారీ టీనేజీ అమ్మాయిలు, కన్యలైన పడుచులను గవర్నర్ నివాసమైన రాజ్ భవన్ కు రప్పించుకొని రాసలీలు సాగించిన వీడియోలను ఓ చానల్ టెలికాస్ట్ చేయడం.. దేశవ్యాప్తంగా సంచలనం రేపడం.. ఆయన పదవి పోవడం చకచకా జరిగిపోయాయాయి. ఇప్పుడు అదే జరిగింది. సేమ్ అలాగే మరో కామ గవర్నర్ లీలలు బయటపడ్డాయి..
మేఘాలయ గవర్నర్ షణ్ముగనాతన్ మీద ఆయనతో ఉండే రాజభవన్ ఉద్యోగులే కేంద్రానికి, ప్రధానికి, రాష్ట్రపతికి లేఖ రాసి ఆయన రాసలీలలపై ఫిర్యాదు చేశారు. రాజ్ భవన్ ను షణ్ముగనాథన్ క్లబ్ గా మార్చేశారని.. అమ్మాయిలు నేరు గా గవర్నర్ పడక గదికి వెళ్తున్నారని రాజ్ భవన్ సిబ్బంది ఆరోపణల నేపథ్యంలో గత్యంతరం లేని స్థితిని తెచ్చుకున్నారు షణ్ముగనాథన్.. దీంతో అన్ని వైపులా ఒత్తిడి పెరిగి .. ఆయన రాసలీలలు.. ఇది వరకు ఓ పీఆర్వో తో వ్యవహరించిన తీరు బయటపడడంతో గతి లేక రాజీనామా చేశారు.

To Top

Send this to a friend