రాశి భయపెడుతోంది..


ఒకప్పటి హీరోయిన్ రాశి.. ఇప్పుడు సైడ్ క్యారెక్టర్లు, టీవీల్లో నటిస్తూ బిజిగా ఉంది. కానీ మళ్లీ చానాళ్ల తర్వాత వెండితెరపై ఓ హర్రర్ సినిమాతో వచ్చేస్తోంది. రాశి ప్రధాన పాత్రలో నిర్మించిన చిత్రం లంక.. ఓ నది మధ్యలో ని ఇంటిలో ఏం జరిగిందనేది కథ.. ఈ సినిమా ఫస్ట్ లుక్ అదిరిపోయేలా ఉంది. రాశి భర్త శ్రీముని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సాయి రోనక్, ఎనా ససహా ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ సంగీతం అందిస్తున్నాడు..

ఈ సినిమాలో రాశి భయపెట్టే పాత్రలో అద్భుతంగా నటించింది. దెయ్యం రోల్ లో కనిపించినట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. నిమిషం నిడివి గల ఈ ట్రైలర్ ప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనం రేపుతోంది. టేకింగ్, ఎడిటింగ్ సస్పెన్స్ ఉన్నాయి. మాటల్లేని ‘లంక’ ట్రైలర్ ను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend