రామ్ చరణ్ — థ్రువ రివ్వు

druva_ramcharan_audio02కథ : సంఘ విద్రోహులను కాదు ఆ విద్రోహులను తయారు చేసే వ్యవస్థను నాశనం చేయాలనే ధృడ నిశ్చయంతో పోలీస్ ఆఫీసర్ గా మారిన వ్యక్తి ధృవ (రామ్ చరణ్). వంద మంది దొంగల్ని పట్టుకోవడం కంటే.. ఆ దొంగలకి సహాయం చేసే మెయిన్ పిల్లర్ ను దెబ్బ కొట్టాలనుకొంటాడు. ఆ మెయిన్ పిల్లరే సిద్దార్ధ్ అభిమన్యు (అరవిందస్వామి). మెడికల్ సైంటిస్ట్ గా, ప్రొఫెషనల్ బిజినెస్ గా పైకి కనిపిస్తూ.. ఎవరికీ తెలియకుండా ప్రభుత్వాన్ని సైతం శాసిస్తూతుంటాడు.అటువంటి అత్యంత శక్తిమంతుడితో కండ బలంతో కాకుండా బుద్ధి బలంతో హీరో సాగించిన పోరాటమే “ధృవ” కథాంశం.

నటీనటుల పనితీరు : సిక్స్ ప్యాక్ ఫిజిక్ తో అబ్బురపరిచిన రామ్ చరణ్ పరిణితి చెందిన నటనతో ఆశ్చర్యపరిచాడు. ఎమోషనల్ సీన్స్ లో అక్కడక్కడా తేలిపోయినప్పటికీ.. యాక్షన్ సీన్స్ లో దుమ్ము లేపాడు. ముఖ్యంగా విలన్ పాత్రధారి అయిన అరవిందస్వామితో మైండ్ గేమ్ ఎపిసోడ్స్ లో అరవింద స్వామితో పోటీపడి నటించిన తీరు బాగుంది. సినిమాకి హీరో రామ్ చరణ్ అయినప్పటికీ.. కథకి హీరో మాత్రం అరవిందస్వామి. సూపర్ స్టైలిష్ గా అరవిందస్వామి సరికొత్తగా విలనిజాన్ని చాలా పద్ధతిగా పండించిన విధానం సినిమాకి మెయిన్ హైలైట్. డైలాగ్ డెలివరీ మొదలుకొని, బాడీ లాంగ్వేజ్ వరకూ అన్నీ విషయాల్లోనూ హీరోను డామినేట్ చేసేస్తుంటాడు అరవిందస్వామి.

రకుల్ ప్రీత్ ఈ సినిమాలో గ్లామర్ డోస్ మరింతగా పెంచింది. “పరేషానురా” పాటలో సముద్రతీరంలో ఆరేసిన అందాలు మాస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగించడం ఖాయం. అలాగే పెర్ఫార్మెన్స్ పరంగానూ అలరించింది. నవదీప్ కనపడేది కొద్దిసేపే అయినా.. “జనా” పాత్రలో కావాల్సినంత ఎమోషన్ ను పండించాడు. విలన్ తండ్రిగా పోసాని కామెడీ ఆడియన్స్ ను ఆకట్టుకొంటుంది.మిగతా నటీనటులందరూ పాత్రకి అవసరమైనంతమేరకు చక్కని నటన కనబరిచారు.

విశ్లేషణ : రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్స్, మూస యాక్షన్ సినిమాలు చూసి చూసి బోర్ కొట్టేసిన ఆడియన్స్ కు విపరీతంగా నచ్చే చిత్రం “ధృవ”. ముఖ్యంగా మెగాభిమానులకు ఈ సినిమా ఓ విందు భోజనం లాంటిది.

ఒక్క మాటలో చెప్పాలంటే  మగధీర తరువాత చరణ్ ఆకలి తీర్చిన సినిమా

 

To Top

Send this to a friend