రామ్‌గోపాల్‌వ‌ర్మ `వంగ‌వీటి` ఆడియో

6z0a0021
విజ‌య‌వాడ న‌గ‌రంలోఒక‌ప్పుడు సెన్సేష‌న్ క్రియేట్ చేసిన కొంత‌మంది వ్య‌క్తులు, కొన్ని సంఘ‌ట‌న‌లు ఆధారంగా  రామ్‌గోపాల్ వ‌ర్మ సినిమా చేయ‌బోతున్నాన‌ని అనౌన్స్ చేయ‌గానే సినిమాపై చాలా ఆస‌క్తి  పెరిగింది.రామదూత‌ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దాసరి కిర‌ణ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభం నుండి ప్రేక్ష‌కుల్లో చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.

గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 2న విడుద‌ల చేసిన వంగ‌వీటి ట్రైల‌ర్‌కు రెండు మిలియన్ వ్యూస్ వ‌చ్చాయి. అల్రెడి విడుద‌లైన పాట‌ల‌కు ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ సినిమా ఆడియో విడుల కార్య‌క్ర‌మాన్ని గ్రాండ్‌గా విజ‌య‌వాడ‌లో విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా …
చిత్ర ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ మాట్లాడుతూ – “విజ‌య‌వాడ రౌడీయిజంపై నా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న `వంగ‌వీటి` నాకు చాలా ప్ర‌త్యేక‌మైన చిత్రం. అప్ప‌ట్లో అక్క‌డ జ‌రిగిన చాలా సంఘ‌ర్ష‌ణ‌ల‌కు నేను ప్ర‌త్య‌క్ష‌సాక్షిని.  ఇప్ప‌టికే విడుద‌లైన‌ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు, సాంగ్స్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.అలాగే ర‌వి శంక‌ర్ మ్యూజిక్‌లో రూపొందిన మిగిలిన పాట‌లు కూడా అంద‌రినీ ఆక‌ట్టుకుంటాయి. డిసెంబ‌ర్ 3న వంగవీటి ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వాడ‌లోని కోనేరు ల‌క్ష్మ‌య్య యూనివ‌ర్సిటీ గ్రౌండ్స్‌లో పలువురి ప్ర‌ముఖుల స‌మక్షంలో విడుద‌ల చేయ‌నున్నాం. ఇప్పుడు నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబ‌ర్ 23న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.
బ్యాన‌ర్ః రామదూత క్రియేష‌న్స్‌, ర‌చ‌యిత‌లుః చైత‌న్య ప్ర‌సాద్‌, రాధాకృష్ణ‌, సాహిత్యంః సిరాశ్రీ, చైత‌న్య‌ప్ర‌సాద్‌సినిమాటోగ్ర‌ఫీః రాహుల్ శ్రీవాత్స‌వ్‌, కె.దిలీప్ వ‌ర్మ‌, సూర్య చౌద‌రి, ఎడిట‌ర్ః సిద్ధార్థ్ తాతోళ్లు, మ్యూజిక్ః ర‌విశంక‌ర్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః విస్సు, ప్రొడ్యూస‌ర్ః దాస‌రి కిర‌ణ్‌కుమార్‌, ద‌ర్శక‌త్వంః రామ్‌గోపాల్ వ‌ర్మ‌.

To Top

Send this to a friend