రాజు ఆర్భాటం.. పేద పోరాటం..

ఆ ఫొటోలు చూడగానే గుండె కల్లుక్కుమంది.. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కడిగేయాలనిపించింది. రైతు పేదగా మారిన వైనం హృదయాన్ని తాకింది. నిర్లక్ష్యపు ఏలికల పాలనలో రైతన్న పరిస్థితి చూసి జాలేసింది.. ఓ పక్క రాజు ఏమో తన కోర్కెలు తీర్చుకునేందుకు ఏడుకొండలు శరణుజొచ్చాడు.. మరోపక్క ఆయన సిబంది మందిమార్బలం రాజు సేవలో తరిస్తున్నారు. ఆ రాచకరికపు రాజు పాలనలో ఉద్యోగులు, అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ప్రజా అవసరాలను గుర్తించిన ఆ పాలకుల పాపం రైతులకు శాపమైంది.. పంటలు ఎండిపోతున్నా కనికరించినా ట్రాన్స్ కో అధికారులను అడిగే నాథుడే కరువయ్యాడు. అందుకే ఆరుగాలం కష్టించి పండించిన పంట కోసం ఆ రైతులు తిప్పలు పడుతున్నారు. మరోపక్క చేయి కరువై.. బతుకు బరువై.. ప్రభుత్వంపై ఆశ దూరమై.. ఓ అన్నాదత రాజే ఏలే రాజధాని చెంతన బతుకు పోరాటం చేస్తున్నాడు. ఎవ్వరికీ ఎవ్వరిని పట్టించుకోని ఈ రాజ్యంలో రైతు పరిస్థితి ఇదీ..

To Top

Send this to a friend