రాజీనామాల దిశగా అసంతృప్తులు..

ఏపీ మంత్రివర్గ పునర్య్వస్థీకరణతో అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. టీడీపీ లో మంత్రి పదవి కోల్పోయిన వారు.. కొత్తగా ఆశించి భంగపడ్డ వారు అలకపాన్పు ఎక్కి రాజీనామాలకు సిద్ధమయ్యారు. మంత్రి పదవి కోల్పోయిన సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మొదటగా టీడీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్ కోడెలకు, సీఎం చంద్రబాబుకు పంపారు. అలాగే మంత్రి పదవి ఆశించి భంగపడిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సామాన్య పార్టీ కార్యకర్తగా కొనసాగుతానని ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేసి పిలిపించడంతో ఆయన వెనక్కు తగ్గారు.

మోరవైపు తనకు మంత్రి పదవి దక్కకపోయే సరికి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్ర అసంతృప్తికి గురై ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తాను ఏ పార్టీ లో చేరనని.. అవసరమైతే తనే కొత్త పార్టీ పెడతానని హెచ్చరించారు. ఇక మంత్రి పదవి ఆశించిన విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి కూడా అలక వహించారు. కేబినెట్ లో అవకాశం దక్కకపోవడంతో ఫోన్ స్విచ్చాఫ్ చేసి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు.

చంద్రబాబు అసంతృప్తుల గురించి ఆలోచించకుండా వారిని మేనేజ్ చేయకుండా చేసిన మంత్రి వర్గ విస్తరణలో టీడీపీలో చిచ్చురేపుతోంది. చాలా మంది నాయకులు మంత్రి పదవులు ఆశించి రాకపోవడంతో రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. వారిని చంద్రబాబు అండ్ కో బుజ్జగిస్తోంది. ఈ పరిణామాలు టీడీపీలో ఐక్యత లోపించి 2019 ఎన్నికల్లో నష్టం చేకూర్చేలా ఉన్నాయి.

To Top

Send this to a friend