రాజా, వారి పరివార భోగం..

ఓ రాజ్యం సుసంపన్నంగా ఉన్నదంటే ఏంటని అర్థం.. అక్కడి ప్రజలు ఆ రాజువల్ల.. పరిపాలన వల్ల ఆనందంగా ఉన్నారని అర్థం.. కానీ రాజే విలాసాలకు పోతే.. ప్రజలకు మెతుకులు విదిల్చి తాను బిర్యానీ తింటే.. ఎలా ఉంటుంది.. ప్రజలు మండిపోరా.. ఇప్పుడు అదే జరుగుతోంది తెలంగాణలో..

సీఎం కేసీఆర్ ప్రజాధనాన్ని పప్పూ బెల్లాల్ల ఖర్చుపెడుతున్నారని విపక్షాలు చేస్తున్న విమర్శల్లో అర్థం ఉంది. మొన్నటికి మొన్న రూ.50కోట్లతో తన కోసం రాజభవనాన్ని కేవలం 6 నెలల్లో సిద్ధం చేసుకున్నారు. అదే పేదల సొంతింటి కల అయిన డబుల్ బెడ్ రూం ఇళ్లకు నిధులు లేవంటూ తప్పించుకుంటున్నారు. ఆ తర్వాత అసెంబ్లీని కూలగొట్టి కొత్తది కట్టిస్తానంటున్నాడు. ఎమ్మెల్యేలకు 100 కోట్లు పెట్టి నివాసాలు సమకూరుస్తున్నారు. ఇప్పుడు ఏకంగా రాజ్ భవన్ ఉద్యోగుల కోసం పెద్ద అపార్ట్ మెంట్లను కట్టించి గృహ ప్రవేశం చేశారు. అందులో పాఠశాలను నెలకొల్పారు.. దీనిపై ఎవ్వరికి అభ్యంతరం లేకున్నా పేదల గూడు విషయంలో అటువంటి శ్రద్ధ చూపిస్తే జనాలైనా బాగుపడతారు కదా.. కానీ ఆ విషయాల్లో మాత్రం కేసీఆర్ అన్నీ అపశకనాలే తోస్తాయి..

కేసీఆర్ తనకు, ఎమ్మెల్యేలకు ఇళ్లు కట్టిస్తున్నారు. కోట్లు ఖర్చుచేస్తున్నారు. ఆ తర్వాత తన పరివారమైన పోలీసులు, అధికారులకు ఇళ్లు సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇప్పుడు రాజ్ భవన్ ఉద్యోగుల కోసం పెద్ద పెద్ద భవనాలు స్కూళ్లు కట్టిస్తున్నారు. అంతే సరే.. మీకు ఓట్లు వేసింది.. గెలిపించింది ప్రజలు వారికోసం కొంచెమైనా పట్టించుకోండి సారూ అంటూ నిలదీస్తున్నారు సామాన్యులు.

To Top

Send this to a friend