రాజమౌళి సినిమా చెప్పేశాడు..


బాహుబలి.. బాహుబలి.. ఈరోజు ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఇప్పుడు సినిమా కోసం అందరి దృష్టి నెలకొంది.. ఏప్రిల్ 28న రిలీజ్ అయ్యే సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ప్రస్తుతం బాహుబలి 2 పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్న రాజమౌళి తన తర్వాతి సినిమాపై విలేకరులు ప్రశ్నించగా ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు..

ప్రస్తుతం బాహుబలి2 రిలీజ్ అయ్యాక ఈ సినిమా ఆలోచనలన్నీ వదిలేసి ఓ రెండు వారాలు హాలీడే ట్రిప్ వేస్తానని.. ఆ తర్వాత తీరిగ్గా మరో సినిమా గురించి ఆలోచిస్తానని రాజమౌళి చెప్పారు. అయితే మహాభారతం తీసే ఆలోచన ఇప్పటివరకైతే లేదు అని తేల్చిచెప్పారు. ఇక తన తరువాతి సినిమా ఉంటుందని.. కానీ అది గ్రాఫిక్స్ లేకుండా తీస్తానని అన్నారు.. బాహుబలి 2 ట్రైలర్ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ‘గ్రాఫిక్స్ వర్క్ చేసిన కమల్ కణ్నన్ ను చూపిస్తూ నా తరువాతి సినిమా కమల్ సాయం లేకుండా చేయాలనుంది.. అందుకోసం గ్రాఫిక్స్ లేకుండా సినిమా ప్లాన్ చేస్తా’ అని రాజమౌళి చెప్పాడు. దీనికి నిర్మాత శోభు మైక్ అందుకొని.. గత రాజమౌళి సినిమాల్లో కూడా ఇదే అనుకున్నాడని.. కానీ ఆరేళ్లుగా గ్రాఫిక్స్ లేకుండా సినిమా తీయలేకపోతున్నాడని రాజమౌళిని ఉద్దేశించి అన్నాడు. దీంతో సభావేదికపై నవ్వులు విరబూశాయి.

To Top

Send this to a friend