రాజమౌళి తర్వాతి సినిమా హీరో..?


ప్రస్తుతం బాహుబలి సినిమా ప్రమోషన్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఫుల్ బిజీగా ఉన్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాష్లలో చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం పూర్తయ్యాక ఓ రెండు నెలలు కుటుంబంతో కలిసి ఫారిన్ టూర్లలో ఎంజాయ్ చేస్తానని రాజమౌళి ప్రకటించారు. ఆ తర్వాతే కొత్త సినిమా గురించి చెబుతానని చెప్పాడు..

కాగా విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాజమౌళి తర్వాతి సినిమా హీరోల్లో ఇద్దరే ముందున్నారు. ఒకటి సూపర్ స్టార్ మహేశ్, రెండోది ఎన్టీఆర్.. ఎన్టీఆర్ తో సహజంగానే రాజమౌళికి బాగా కనెక్టివిటీ ఉంది. ఎన్టీఆర్ సినిమా చేస్తానని.. తన ఫేవరేట్ హీరో ఎన్టీఆరేనని రాజమౌళి చాలా సార్లు చెప్పాడు. మరి అతడితో ఉంటుందా అంటే అదీ క్లారిటీ ఇవ్వలేదు.

కాగా అప్పట్లో మహేశ్ ను కలిసి రాజమౌళి ఒక కథను చూచాయగా చెప్పాడని తెలిసింది. నిర్మాతను కూడా ఆ సినిమాకు ఫైనలైజ్ చేశాడట.. కౌబాయ్ కథను మహేశ్ కోసం సిద్దం చేసినట్లు వార్తలు వచ్చాయి. టక్కరిదొంగతో కౌబాయ్ గెటప్ వేసి చేతులు కాల్చుకున్న మహేశ్ ను తాను సినిమా తీసి భారీ హిట్ కొట్టించాలని రాజమౌళి యోచిస్తున్నారట.. పైగా తాను బాహుబలి ప్రమోషన్ లో చెప్పినట్టు తన తరువాతి సినిమాకు గ్రాఫిక్స్ లేకుండా చేయాలని పట్టుదలతో ఉన్నారు. అందుకే కౌబాయ్ కథను ఎంచుకొని గ్రాఫిక్స్ లేకుండా మహేశ్ తో తీయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. కానీ ఈ ఇద్దరిలో ఎవరితో రాజమౌళి సినిమా తీస్తాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్.. ఓ రెండు నెలలు గడిస్తే కానీ రాజమౌళి హీరో ఎవరో తెలియదు..

To Top

Send this to a friend