రాజమౌళి తన తదుపరి చిత్రం ఏంటో చెప్పేశాడు..

rajamouli-director-apnewsonlinein

ఓ శిల్పి తన మేధస్సుతో రాయిని చెక్కి దైవంగా ఎలా మలుస్తాడో అంతటి పట్టుదలతో సినిమాలు తీస్తుంటాడు రాజమౌళి.. రాజమౌళి ప్రతీ సినిమా ఘనవిజయమే.. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఆయన సినీ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది కానీ ఎక్కడా తగ్గలేదు.. ఈగ, మగధీర, ఇప్పుడు బాహుబలి సినిమాలతో కళాఖండాలనే సృష్టించారు. అన్నింటిని సాంకేతికంగా అద్భుతాలుగా చిత్రీకరించారు.

తాజాగా హైదరాబాద్ లో జరిగిన సౌత్ కాన్క్లేవ్ 2017 ఫెస్టివెల్ లో రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాహుబలి తర్వాత ఏం సినిమా చేస్తారనే దానిపై జక్కన్న రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు.. తన జీవిత స్వప్నం, చిరకాల వాంఛ ‘మహా భారతం’ సినిమాను తీయాలని ఉందని.. మహాభారతంలోని విభిన్న కోణాల్ని మునుపెన్నడూ చూడని విధంగా భారీ స్థాయిలో విజువల్ వండర్ గా తెరపై చూపించాలన్నదే తన కోరిక అని సదస్సులో వ్యాఖ్యానించారు. అందులోకి ఒక్క ఉప కథ అయినా తనకు చాలా స్ఫూర్తినిస్తుందని తెలిపారు. ప్రస్తుతం తీస్తున్న బాహుబలి సినిమా మరో 30 ఏళ్ల వరకు జనం గుర్తుంచుకునేలా ఉంటుందని.. విజువల్స్ విషయంలో అంతలా కసరత్తు చేస్తున్నామన్నారు. ఇక మహాభారతం నిర్మిస్తే అది దేశ చరిత్రలోనే ఎవర్ గ్రీన్ చిత్రం అవుతుందన్నారు.. అమర్ చిత్ర కథల ప్రభావంతోనే తాను బాహుబలి, మగధీర లాంటి కథల్ని ఎంచుకున్నానని తెలిపారు. చిన్నప్పుడు చదివిన పుస్తకాల లోంచే తనకు కథలు పుట్టి అవి ఇప్పుడు సినిమాగా మారి ఘనవిజయం సాధిస్తున్నాయని తెలిపారు.

కాగా రాజమౌళి మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా ప్రకటించడంతో దీన్ని హిందీతో పాటు అన్ని భారతీయ భాషల్లో అనువదించడం ఖాయంగా తోస్తోంది. కరణ్ జోహర్ ఇప్పటికే రాజమౌళి సినిమా తీస్తే తాను నిర్మాతగా ఉంటానని ప్రకటించారు. ఇక రాజమౌళి కనుక మహాభారతం సినిమా తీస్తే తాను కర్ణుడి పాత్రను పోషిస్తానని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తన మనసులోని మాట బయటపెట్టాడు. మరి దీనికి రాజమౌళి అంగీకరిస్తారా లేదా అన్నది వేచి చూడాలి..

To Top

Send this to a friend