రాజమౌళి… తండ్రిని తిట్టాడా..? పొగిడాడా..?

అన్నింటా నా తండ్రి గొప్పవాడే.. కానీ దర్శకత్వం విషయంలో తనకు నాన్న విజయేంద్రప్రసాద్ పోటీయేనని స్పష్టం చేశారు దిగ్గజ దర్శకుడు రాజమౌళి.. రాజమౌళి నాన్న విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన శ్రీవల్లి సినిమా ఆడియో వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. రజిత్ నేహా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీని సునీత, రాజ్ కుమార్ నిర్మించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి కుటుంబ సభ్యులు కీరవాణి, శివశక్తి, రమారాజమౌళి, దత్తా తదితరులు అందరూ హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ‘‘నాన్న కథ రచయితగా బాహుబలి, బజరంగీ భాయ్ జాన్ సినిమాలతో దేశంలో రెండు భారీ హిట్ లు కొట్టి దిగ్గజ రచయితగా ఎదిగారన్నారు..దానికి సమానంగా దర్శకుడిగా కూడా అంతే గొప్ప సినిమా తీస్తే ఓ కొడుకుగా గర్వపడతా.. కానీ దర్శకుడిగా మాత్రం నాన్నకు పోటీదారుగానే చూస్తా.. ఆయన సినిమాలోని లూప్ హోల్స్ ను వెతుకుతా నని ’’ రాజమౌళి స్ఫష్టం చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి తాము చిన్పప్పుడు ధనవంతులమని.. కానీ తరువాత ఆస్తి కరిగిపోయి చైన్నైలో అష్టకష్టాలు పడ్డామని వాపోయారు. నాన్న , పెద్దనాన్న రచయితలుగా పేర్లు పడడానికి చాలా కష్టపడ్డారన్నారు. ఈ సందర్భంగా శ్రీవల్లి సినిమా స్టోరీ తనకు నచ్చలేదని.. అది తన తండ్రికి చెప్పానన్నారు. మార్పులు చేశారని తెలిసిందని..కానీ ఆ సినిమా చూస్తే కాని తెలియదన్నారు.

కాగా రాజమౌళి మాటలు వేదికపైనున్న వారిని, టీవీల్లో చూస్తున్నవారిని ఆశ్చర్యానికి లోనుచేశాయి. అసలు రాజమౌళి మాటల్లో తండ్రిని తిడుతున్నాడా.. పొగుడుతున్నాడో తెలియని అయోమయం నెలకొంది. ఓ పక్క రచయితగా కీర్తిస్తూనే తండ్రి విజయేంద్రప్రసాద్ దర్శకత్వాన్ని రాజమౌళి విమర్శించారు. ఎంచుకున్న కథ తనకు నచ్చలేదని వేదికపై పేర్కొన్నాడు. అందుకే రాజమౌళి ప్రసంగం చేస్తున్నప్పుడు తండ్రి సీరియస్ గా విన్నాడు. వేదికపై నున్న కీరవాణి, రమ, శివశక్తిదత్తా లు కూడా చప్పట్లు కొట్టకపోవడం గమనార్హం. కాగా తండ్రి షూలేస్ వేదికపై ఊడిపోవడంతో స్వయంగా రాజమౌళి వంగి షూలేస్ కట్టడం విశేషం..

రాజమౌళి చేసిన ప్రసంగం వీడియోను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend