రాజమౌళి గురిపెట్టాడు.. బాహుబలి 2 పోస్టర్ రిలీజ్

గురిపెట్టాడు.. రాజమౌళి గురిపెట్టాడు.. మళ్లీ రికార్డులు సాధించే దిశగా అడుగు ముందుకేశాడు.. గణతంత్ర దినోత్సవ కానుకగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి తన కలల చిత్రం బాహుబలి2 మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి అభిమానులకు కన్నుల విందును అందించారు. ఈ పోస్టర్ లో ప్రభాస్, పక్కన దేవసేన (అనుష్క) విల్లంబులు ఎక్కుపెట్టి యుద్ధ సన్నాహాల్లో దీర్ఘంగా చూస్తున్నట్టు ఉంది.. ఆ మధ్య వచ్చిన సినిమాల్లో చాలా లావుగా కనిపించిన అనుష్కను.. ఈ పోస్టర్ లో చూసిన వారు నోరెళ్లబెడుతున్నారు. అంతలా గ్లామర్ గా ఉంది. చక్కటి రూపం.. బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకుంటోంది. అసలు ఈమె అనుష్క యేనా అనే రీతిలో అద్భుతంగా ఉంది..

రాజమౌళి తెలుగు, తమిళం, హిందీ, మలయాళం లలో అన్ని భాషల పోస్టర్లను ఒకే సారి ఈరోజు ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు. ప్రభాస్, అనుష్క ఇద్దరు ఐదారు బానాలను విల్లంబులతో ఎక్కుపెట్టి.. ఒక చారిత్రక మందిరంలో తీక్షణంగా చూస్తున్న ఈ ఫొటోను రాజమౌళి షేర్ చేశారు. ఈ పోస్టర్ చూశాక బాహుబలి2పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. విల్లంబులు ఎక్కుపెట్టి అభిమానుల గుండెల్లో దించారు రాజమౌళి. అంతలా ఆకట్టుకుంటున్న ఈ పోస్టర్ ఇప్పుడు వైరల్ లా వ్యాపిస్తోంది..

To Top

Send this to a friend