రాజమౌళి కన్నా క్రిష్ నూరుపాళ్లు నయం..!!

krish-rajamouli-apnewsonline

బాహుబలి, రాజమౌలి అభిమానులు కచ్చితంగా పైన హెడ్డింగ్ చూసి గుస్సా అయ్యి ఉంటారు.. కానీ నిజం.. రాజమౌళితో పోలిస్తే ఒక విషయంలో బాలక్రిష్ణ వందో సినిమా డైరెక్టర్ అయిన క్రిష్ నూరు పాళ్లు నయమనే చెప్పాలి.. సినిమా అనేది రంగుల ప్రపంచం.. అది ప్రేక్షకులకు చేరువ అయినప్పుడే హీరో నిలబడతాడు.. దర్శకుడు పేరుపొందుతాడు.. నిర్మాతకు నాలుగు కాసులు మిగులుతాయి.. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా అందరూ రోడ్డున పడతారు.. తెలుగు ఇండస్ట్రీలో ప్లాప్ లతో కనుమరుగైన హీరోలు, దర్శకులు, నిర్మాతలు చాలా మందే ఉన్నారు.. హీరోలు తరుణ్, ఉదయ్ కిరణ్ లు మొదట్లో భారీ హిట్ లు కొట్టి ఆ తరువాత తమ ఉనికినే కోల్పోయారు. భారీ చిత్రాల నిర్మాతగా పేరుగాంచి ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం లాంటి మెగా హిట్ లు తీసిన నిర్మాత ఎం.ఎస్ రాజు ఇప్పుడు తన కొడుకును ఇండస్ట్రీలో నిలబెట్టడానికి డబ్బుల్లేక సినిమాలు తీయలేక ఆపసోపాలు పడుతున్నాడు. ఇదంతా సినిమాల ప్రభావమే.. ఎంఎస్ రాజు పౌర్ణమి సినిమాకు భారీగా పెట్టుబడి పెట్టి అది ప్లాప్ అయ్యి ఆ తరువాత నుంచి కోలుకోలేదు.. ఇక ఎన్టీఆర్ తో సినిమా తీసిన ఓ నిర్మాత అదీ మొదటిరోజు ప్లాప్ టాక్ రావడంతో నిండా మునిగి హుస్సేన్ సాగర్ లో దుంకిన ఘటన సినిమాలోకంలోని ఎత్తుపల్లాల్ని మనముందుంచుంది.. అందంతా పక్కనపెడితే..
రాజమౌళి కంటే క్రిష్ ఎంతో బెటర్.. ఎందుకంటే బాహుబలి లాంటి ప్రపంచ ప్రఖ్యాత కళాఖండాన్ని చెక్కడానికి రాజమౌళికి దాదాపు 3ఏళ్ల సమయం పట్టింది. 200కోట్లకు పైగా ఖర్చయింది. ఒకవేళ సినిమా ప్లాప్ అయితే నిర్మాత, దర్శకుడు రాజమౌళి మూడేళ్లు ఏ సినిమా చేయక అంకితమైన ప్రభాస్ ఘోరంగా నష్టపోయారు. అసలు కోలుకునేవారు కాదు.. అంతటి భయం బాహుబలి రిలీజ్ అప్పుడు వారి ముఖాల్లో స్పష్టం గా కనపడింది. అది హిట్ అయ్యింది కాబట్టి ఎవరూ మాట్లాడడం లేదు.. అదే ఫలితం రివర్స్ అయ్యింటే.. అందుకే క్రిష్ లాంటి వారే సినిమా ఫీల్డ్ లో బెటర్..
క్రిష్ స్వయానా తన కుటుంబంనుంచి ఒకరిని శాతకర్ణి సినిమాలో పెట్టుబడి దారుగా పెట్టాడు. అంతేకాదు.. యావత్ భారతాన్ని గెలిచిన శాతకర్ణి మూవీని కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ఎక్కడా ఏదీ కోల్పోకుండా రిచ్ గా తీశాడు. ట్రైలర్ లో అది కనపడుతోంది.. రాజమౌళిలా భారీ సెట్టింగ్ లకు పోకుండా యూరప్ లోని చక్రవర్తుల కోటల్లో షూటింగ్ నిర్వహించి ఖర్చు తగ్గించేశాడు. కేవలం 50 కోట్ల లోపు బడ్జెట్ తో నేడు సినిమా తీసి ఔరా అనిపించాడు. ఈ సినిమా ఆడితే అంతకు మూడు నాలుగు రెట్టు డబ్బులొస్తాయి. ఒకవేట అటు ఇటు అయినా ముగ్గురు నిర్మాతలకు కనీసం పెట్టుబడి తిరిగి వస్తుందన్న గ్యారెంటీ ఉంది.. అందుకే భారీ ఢాంబికలు పోయి కోట్టు ఖర్చుపెట్టే దర్శకుల కన్నా ఉన్న వనరులతో అద్బుతంగా సినిమా తీసిన క్రిష్ మిన్న అనడంలో ఎలాంటి సందేహం లేదు..

To Top

Send this to a friend