“రాజకుమారి” కోసం నారా రోహిత్!

వైవిధ్యమైన కథలను ఎంచుకొంటూ యువ కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకొన్న నారా రోహిత్ నటిస్తున్న తాజా చిత్రం “కథలో రాజకుమారి”. శ్రీహాస్ ఎంటర్ టైన్మెంట్స్ మరియు అరణ్ మీడియా వర్క్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నేడు (ఫిబ్రవరి 14) విడుదల చేశారు. మహేష్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రశాంతి, సౌందర్య నర్రా, కృష్ణ విజయ్ నిర్మాతలు. నారా రోహిత్ తోపాటు నాగశౌర్య మరో ముఖ్యపాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ కీలకపాత్రధారి.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. “”జ్యో అచ్యుతానంద” అనంతరం నారా రోహిత్-నాగశౌర్యలు కలిసి నటిస్తున్న సినిమా ఇది. నారా రోహిత్ రఫ్ లుక్ తో విడుదల చేసిన పోస్టర్, మోషన్ పోస్టర్ కి మంచి స్పందన లభిస్తోంది. నారా రోహిత్ చాలా వైవిధ్యమైన క్యారెక్టరైజేషన్ లో ఈ సినిమాలో కనిపించనున్నారు. షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యింది, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆడియో మరియు ట్రైలర్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అతి త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. మహేష్ సూరపనేని ఈ చిత్రంలో రోహిత్ వేషధారణను తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. అలాగే ఆయన “కథలో రాజకుమారి” చిత్రాన్ని తెరకెక్కించిన విధానం కూడా సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది” అన్నారు.
నమిత ప్రమోద్, అజయ్, ప్రభాస్ శ్రీను, కోట శ్రీనివాసరావు, రాజీవ్ కనకాల, మురళీమోహన్, చలపతిరావు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నరేష్ కె.రాణా, సంగీతం: ఇళయరాజా-విశాల్ చంద్రశేఖర్, కళ: సాహి సురేష్, ఫైట్స్: వెంకీ, లిరిక్స్: కృష్ణ చైతన్య, కెకె.బాలాజీ, అడిషనల్ డైలాగ్స్: రాజ్ కుమార్ వెలిసెల, కథ-చిత్రానువాదం-మాటలు-దర్శకత్వం: మహేష్ సూరపనేని, సమర్పణ: రాజేష్ వర్మ సిరువూరి, నిర్మాతలు: ప్రశాంతి, సౌందర్య నర్రా, కృష్ణ విజయ్!

To Top

Send this to a friend