రాఘవేంద్రరావు గురించి షాకింగ్ న్యూస్..

raghavendrarao-director

నాగార్జున కథానాయకుడిగా నటించిన ఓం నమో వేంకటేశాయా మూవీ ఆడియో వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. కే. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ వేడుకకు నాగార్జున కుమారులు అఖిల్, నాగచైతన్య అతిథులుగా హాజరై ఒక ఆడియో సీడీని, మరొకరు టీజర్ ను విడుదల చేశారు..

ఈ సందర్భంగా వేదికపై మాట్లాడిన నాగార్జున ఓ సంచలన విషయాన్ని భయటపెట్టాడు.. ఓం నమో వేంకటేశాయ మూవీ తీస్తున్నప్పుడు రాఘవేంద్రరావు తరచూ తనతో ఓ మాట అనేవారని.. తనకు ఈ సినిమాయే లాస్ట్ చిత్రం కావచ్చేమోనని సందేహపడేవారన్నారు.. కానీ తాను దాన్ని వారించి ఆ మాట అబద్ధం కావాలని కోరుకుంటున్నట్టు నాగార్జున చెప్పాడు.. వేంకటేశ్వర స్వామిని సైతం ఇదే కోరుకుంటున్నానని తెలిపారు. భక్తిరస చిత్రాల్లో తాను నటించడం తన పూర్వజన్మ సకృతం అని నాగ్ ఆనందం వ్యక్తం చేశారు..
అనంతరం మాట్లాడిన రాఘవేంద్రరావు.. నాగార్జున హాథీరామ్ బాబా పాత్రలో ఒదిగిపోయారని.. ప్రేక్షకులకు దేవుడి దర్శనం కావాలంటే నాగార్జున కళ్లతో చూడాలని చెప్పారు. అంతలా భక్తుడి పాత్రలో లీనమైన నటుడిని తాను చూడలేదని చెప్పుకొచ్చారు. ఈ వేడుకలో అనుష్క, ప్రజ్ఞా జైస్వాల్, జగపతిాబు, కీరవాణి, సౌరభ్ జైన్, ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు..

To Top

Send this to a friend