తొలిచిత్రంతోనే ఆకట్టుకున్న మలయాళ అందం అనుపమ పరమేశ్వరన్ కు అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ప్రేమమ్ మూవీతో అనుపమ ప్రేక్షకులను కనువిందు చేసింది. ఆ తర్వాత ఆమెను తెలుగులో అఆ మూవీలో అవకాశం కల్పించి ఎంట్రీ ఇప్పించారు దర్శకుడు త్రివిక్రమ్. తెలుగు లో ఈ అమ్మడు నటించిన మూడు సినిమాలు పెద్ద హిట్ లు సాధించాయి. దీంతో వరుస అవకాశాలు ఆమెకు దక్కుతున్నాయి. అయితే అనుపమకు రాంచరణ్, ఎన్టీఆర్ ల సరసన అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయని వార్తలు వచ్చాయి. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో అనుపమ మాట్లాడింది. రాంచరణ్ సినిమాలో దాదాపు అవకాశం వచ్చిందని.. కానీ చివరి నిమిషంలో సినిమా కోల్పోయానని అనుపమ చెప్పుకొచ్చింది. ఆ పెద్ద సినిమా మిస్ అయినప్పుడు చాలా బాధపడ్డానని చెప్పింది. అయినప్పటికీ ఆ చిత్ర దర్శక నిర్మాతలతో నాకు ఇప్పటికీ అనుబంధం కొనసాగిస్తానని చెప్పుకొచ్చింది. రాంచరణ్ తో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉన్నాను.
ఇక ఎన్నీఆర్ తో సినిమా కోల్పోయానని వార్తలు వచ్చాయి. కానీ అసలు ఎన్టీఆర్ తో చేయమని నన్నెవరూ అడగలేదు. అలాంటి ప్రపోజల్ ఏదీ నా దగ్గరకు రాలేదు’ అని చెప్పింది అనుపమ..
ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తరుచుగా వస్తున్నాయి.. అందం అభినయంతో ఆకట్టుకున్న సుందరికి వరుసగా అవకాశాలు వస్తున్న కాల్షీట్ల వల్ల సర్దుబాటు చేయలేక ఇప్పటికే రాంచరణ్ తో నటించే అవకాశం కోల్పోయింది. ఇప్పుడు ఎన్టీఆర్ తో కూడా సినిమా మిస్ అయ్యిందనే వార్తలు వినపడుతున్నాయి.
