రాంచరణ్ సినిమాలోంచి మూడో డ్రాపవుట్

సుకుమార్ దర్వకత్వంలో రాంచరణ్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తీస్తున్న చిత్రంలో నుంచి సమంతను తీసేశారనే వార్త సంచలనం రేపుతోంది. ఈ సినిమాను చాలా రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించారు. రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలు కాలేదు. హీరోయిన్ ఎంపిక కోసం చాలా సమయం తీసుకున్న దర్శకుడు సుకుమార్ మొదట అనుపమ పరమేశ్వర్ ను హీరోయిన్ గా అనుకున్నారు. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ కావాలని చెప్పి సమంతను ఓకే చేశాడు. ఈ మేరకు ప్రకటన కూడా విడుదల అయ్యింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సంచలన విషయం వెలుగుచూసింది.
సమంతను ఈ ప్రెస్టిజియస్ ప్రాజెక్టును తప్పించారనే వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. అఖిల్, శ్రేయాల పెళ్లి బ్రేక్ అవడంతో చైతన్య-సమంత ల పెళ్లి వీలైనంత త్వరగా చేసి భర్తీ చేయాలని అక్కినేని ఫ్యామిలీ నిర్ణయించిందట.. అందుకే కమిట్ అయిన సినిమాల నుంచి సమంత తప్పుకుంటోదని.. అందులో భాగంగానే రాంచరణ్-సుకుమార్ చిత్రాన్ని వదిలేసిందనే టాక్ వినిపిస్తోంది.

ఇది వరుసగా మూడో డ్రాపవుట్.. మొదట రాశీకన్నా.. ఆతర్వాత అనుపమ.. తాజాగా సమంత కూడా తప్పుకోవడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. సినిమాను 5 నెలల్లో పూర్తి చేసి దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పుడు సమంత డ్రాపవుట్ తో సినిమా అనుకున్న సమయానికి వస్తుందా..? లేదా అన్న సంశయం నెలకొంది.

To Top

Send this to a friend