రాంచరణ్ కు ఇది సప్రైజ్


ధ్రువతో వచ్చిన హిట్ తో ఎంజాయ్ చేస్తున్న రాంచరణ్ ఫాంహౌజ్ లో సరదాగా గడుపుతున్నారు. తన ఫాంహౌస్ లో బుధవారం సేదతీరుతుండగా.. ఎక్కడినుంచో ఓ నెమలి వచ్చి సందడి చేసింది. ఈ అనుకోని అతిథి రావడంతో రాంచరణ్ దానికి కొన్ని విత్తనాలు పోసి సరదాగా ఆడుకున్నాడు. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు..

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ పిరియాడిక్ పల్లెటూరి కథాంశంలో నటించనున్నాడు రాంచరణ్.. ఈనెల 20 నుంచి ఆ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ ఖాళీ టైంలో ఆ పాత్ర కోసం కసరత్తు చేస్తూ ఫాంహౌస్ లో గడుపుతున్నారు. చరణ్ సరసన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. కోలీవుడ్ యువ నటుడు వైభవ్ ముఖ్య పాత్రలో కనిపిస్తారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా కోసం రాంచరణ్ వెయిట్ చేస్తున్నాడు. అందులో భాగంగా ఫాంహౌస్ లో గడుపుతుండగా నెమలి రావడంతో దాంతో సరదాగా గడిపారు.

నెమలితో రాంచరణ్ గడిపిన ఆ సరదా వీడియో ను కింద లింక్ లో చూడొచ్చు..

To Top

Send this to a friend