రాంచరణ్.. ఓ పల్లెటూరి పిల్లగాడు.

తెలుగు సినిమా డైరెక్టర్లలో ఎవ్వరికీ లేనంత క్రియేటివిటీ డైరెక్టర్ సుకుమార్ సొంతం.. అది ఎంతంటే రాజమౌళి కూడా కాపీ కొట్టేంత.. అవును నిజం.. మర్యాద రామన్నలో ఓ పాటలో సుకుమార్ తీసిన ఆర్య పాటలో హీరో కొట్టేప్పుడు విలన్లు పడిపోయే రౌండ్ సీన్ ను రాజమౌళి అప్పట్లో కాపీ కొట్టాడు.. ఈ విషయాన్ని రాజమౌళేయే ఓ సినిమా వేడుకలో స్వయంగా తెలిపాడు. అంతటి క్రియేటివిటీ ఉన్న దర్శకుడు కాబట్టే ప్లాపులు పలకరించినా కూడా సుకుమార్ తో చేయడానికి చాలా మంది హీరోలు ఇష్టపడుతారు..

మహేశ్ తో 1 సినిమా ప్లాపునిచ్చినా కూడా ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాను సుకుమార్ తో చేశాడు.. ఆ సినిమా విజయవంతం అయ్యింది. ఇప్పుడు ధ్రువతో హిట్ కొట్టిన రాంచరణ్ తో సుకుమార్ సినిమా స్టార్ట్ అయ్యింది. సోమవారం హైదరాబాద్ లో చిరంజీవి చేతుల మీదుగా రాంచరణ్ మూవీ మొదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ సినిమాను నిర్మిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మాతలు.. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కొరటాల శివ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు..

ఈ సందర్భంగా చిత్రం ఫస్ట్ లుక్ ను రాంచరణ్, సుకుమార్ విడుదల చేశారు. ఈ పోస్టర్ చూశాక సుకుమార్ క్రియేటివిటీ అద్బుతం అనిపించేలా ఉంది. రోటీన్ కు భిన్నంగా పోస్టర్ ఉంది.. రాంచరణ్ బొమ్మ గ్రామీణ నేపథ్యంలో రెండు కడవలు పట్టుకొని గ్రామంలోకి వెళుతున్నట్టు ఉంది. ఈ పోస్టర్ చూశాక సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగుతుందని.. చరణ్ పల్లెటూరి యువకుడి పాత్రను పోషిస్తున్నట్టు అర్థమవుతుంది.. విభిన్నకతలు, ప్రయోగాలకు పెద్దపీట వేసే సుకుమార్ ఈసారి పల్లెటూరి కథలో రాంచరణ్ ను ఎలా చూపించబోతున్నాడన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది..

రాంచరణ్, సుకుమార్ విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్ ను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend