రాంగోపాల్ వర్మ Vs వరంగవీటి రాధ

vangaveeti-radha-rgv

‘పకోడి గాడు.. వేస్ట్ ఫెలో.. జాగ్రత్త నీ పని ఖతం.. తగిన మూల్యం చెల్లిస్తావ్.. డబ్బు ఆశతో రంగాపై బురదజల్లుతావా..’ అంటూ వరంగవీటి రాధ వర్మపై నిప్పులు కురిపించాడు.. తెలుగులోని బూతుల్ని మీడియా ముందు చెప్పలేనంతగా నిస్సిగ్గుగా వాడేశారు. వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ ఇలా రెచ్చిపోయారు. వంగవీటి జీవిత చరిత్రను కించపరేచలా సినిమా తీస్తావా అంటూ వర్మపై నిప్పులు చెరిగారు. ఇక దీనిపై వివాదాస్పద వర్మ వెంటనే స్పందించాడు. ఎవరు తిట్టినా ఆయన ఉంచుకోరు కదా అంతకు వందరెట్లు దుమ్మెత్తిపోశాడు.. ఇప్పుడు అదేచేశాడు..
‘‘రంగా బోసిపళ్ల మహాత్మాగాంధీనా.. లేదా మర్దర్లు చేయని తాత్వికుడా.. మథర్ థెరిస్సాలా సేవ తత్పరుడా.. దానాలు, సేవ చేసి గౌతమ బుద్దుడా’’ అంటూ వర్మ రాధా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు.. బస్తేమే సవాల్ ఎక్కడికైనా వస్తా అంటూ మీసం మెలేశాడు.. పనిలో పనిగా నీకు నచ్చినట్టు నువ్వు సినిమా తీసుకో అంటూ వర్మ రాధాకు ఉచిత సలహా ఇచ్చాడు..
సినిమాలు తీసి నాలుగు రాళ్లు వెనకేసుకోవడం మంచిదే.. కానీ అది పక్కోడిని నవ్వులు పాలు చేసి సంపాదించింది అయితే సుద్ద దండగా.. ఎందుకంటే పక్కవాడి ఏడుపోలోంచి మనకు వచ్చే డబ్బులు అవి వచ్చినా ఒక్కటే రాకున్నా ఒక్కటే.. ఇప్పుడు వంగవీటితో కాంట్రవర్సీ సినిమా తీసి డబ్బులు దండుకుంటున్న వర్మకు ఒకరి జీవిత చరిత్రను వక్రీకరించరించే హక్కు ఎవరిచ్చారు.. శవాలపై పాలాలు ఏరుకున్నట్టు.. వంగవీటి సినిమాతో డబ్బులు ఏరుకుంటున్నావా అని వంగవీటి అభిమానులు మీడియాలో ప్రశ్నిస్తున్నారు.. ఇలా వంగవీటి సినిమాతో అటు వంగవీటి కుటుంబం, ఇటు వర్మ ప్రస్తుతం తిట్ల పర్వం కొనసాగిస్తున్నాడు.. అదీ ఎప్పటికీ ఆగేనా చూద్దాం..
-నరేశ్ ఎన్నం , సీనియర్ జర్నలిస్ట్

To Top

Send this to a friend