రవి, శ్రీముఖి జంటగా “థ్యాంక్యూ మిత్రమా”

HAR_4905
పాపులర్ అండ్ మోస్ట్ ఫేవరెట్ యాంకర్ రవి, బ్యూటిఫుల్ శ్రీముఖి జంటగా.. “జబర్దస్త్” ఫేమ్ గెటప్ శీను కీలకపాత్రలో నటించిన లఘు చిత్రం “థ్యాంక్యూ మిత్రమా”. సిఏ రాకేష్ సిల్వర్ తెరకెక్కించిన ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని “క్లాప్ బోర్డ్ ప్రొడక్షన్స్” బ్యానర్ పై ఆర్కే నల్లం నిర్మించారు. 
30 నిమిషాలు నిడివిగల ఈ షార్ట్ ఫిలిమ్ ప్రీమియర్ షోను శుక్రవారం (జూలై 15) హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో అత్యంత ఘనంగా నిర్వహించారు. చిత్ర పరిశ్రమకు మరియు బుల్లితెరకు సంబంధించిన ప్రముఖులు, ఆత్మీయుల నడుమ జరిగిన ఈ ప్రీమియర్ షోకు రవి మరియు శ్రీముఖిల అభిమానులు వందల సంఖ్యలో వచ్చారు. 
ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, సీనియర్ యాంకర్ సుమ, యాంకర్ కమ్ యాక్ట్రస్ అనసూయ, సంగీత దర్శకులు రఘు కుంచే, ఆర్పీ పట్నాయక్, ప్రముఖ రచయిత-నటుడు హర్షవర్ధన్, పూరీ ఆకాష్, నటుడు సిద్ధూ, యువ దర్శకులు పవన్ సాదినేని, “పెళ్ళి చూపులు” ఫేమ్ అరుణ్ దాస్యం, రచయిత-దర్శకుడు కృష్ణ చైతన్య, సింగర్ నోయల్, నటుడు మధునందన్ తదితరులు పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా విచ్చేసిన ప్రముఖులందరూ “థ్యాంక్యూ” మిత్రమా షార్ట్ ఫిలిమ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. జంటగా నటించిన రవి-శ్రీముఖి అద్భుతమైన నటన కనబరిచారని, సంగీత దర్శకుడు కార్తీక్ మ్యూజిక్ షార్ట్ ఫిలిమ్ కి హైలైట్ గా నిలిచిందని, రాకేష్ త్వరలోనే ఫీచర్ ఫిలిమ్స్ తీసే స్థాయికి ఎదగాలని ఈ సందర్భంగా అందరూ అభిలషించారు. ఎప్పుడూ కామెడీ పాత్రల్లోనే కనిపించే జబర్దస్ట్ శ్రీను ఈ షార్ట్ ఫిలిమ్ లో సీరియస్ యాక్టింగ్ తో ఆకట్టుకొన్నాడని అందరూ ప్రశంసించారు!
To Top

Send this to a friend